Madanapalle: మదనపల్లి కలెక్టరేట్‌లో జెడ్పీ ప్రత్యేక అధికారిక బాధ్యతల స్వీకరణ!

Madanapalle: అన్నమయ్య జిల్లా ప్రజా పరిషత్ స్పెషలాఫీసర్‌గా జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ శుక్రవారం మదనపల్లిలో అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 25 Sept 2026 7:19 PM IST
Madanapalle
X

Madanapalle: మదనపల్లి కలెక్టరేట్‌లో జెడ్పీ ప్రత్యేక అధికారిక బాధ్యతల స్వీకరణ!

Madanapalle: మదనపల్లి, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్నమయ్య జిల్లా ప్రజా పరిషత్ స్పెషలాఫీసర్‌గా జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ శుక్రవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. మదనపల్లి కలెక్టరేట్‌లోని జిల్లా కలెక్టర్ కార్యాలయ ఛాంబర్‌లో సంబంధిత అధికారుల సమక్షంలో జిల్లా ప్రజా పరిషత్ స్పెషలాఫీసర్‌గా బాధ్యతలు చేపట్టారు.

ఈ సందర్భంగా జిల్లా ప్రజా పరిషత్ పరిధిలోని పరిపాలనా అంశాలు, అభివృద్ధి కార్యక్రమాలు, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి సంబంధించిన అంశాలపై ప్రభుత్వ ఆదేశాలు, నిబంధనలకు అనుగుణంగా సమర్థవంతంగా ముందుకు సాగేందుకు చర్యలు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI