Proddatur: ఏపీ అభివృద్ధిలో దూసుకుపోతోంది: కడప ఇన్చార్జ్ మంత్రి సవిత
Proddatur: ప్రొద్దుటూరులో రూ.30 వేల కోట్ల జల జీవన్ మిషన్ పనులకు అక్టోబర్ 5న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేస్తారు: మంత్రి సవిత.
Proddatur: ఏపీ అభివృద్ధిలో దూసుకుపోతోంది: కడప ఇన్చార్జ్ మంత్రి సవిత
Proddatur: ప్రభుత్వం ఒకపక్క 'సూపర్ సిక్స్' పథకాలు అమలు చేస్తూనే, మరోపక్క పరిశ్రమలు, ఇరిగేషన్ పనులు, అమృత్ పనులను పరుగులు తీస్తోంది. ఇటీవల 'పల్లె పండుగ', హార్టికల్చర్ హబ్ లాంటి అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం.
ఈ నెల 5వ తేదీన ప్రొద్దుటూరు లో 30,000 కోట్ల రు "జల జీవన్ మిషన్" పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు మాధవ్ చేతుల మీదుగా శంకుస్థాపన చేస్తున్నాం.
సీనియర్ మంత్రులు నారాయణ, బీసీ జనార్దన్ రెడ్డి, కలెక్టర్, ఎస్పీ మరియు అధికారులతో కలిసి విస్తృత స్థాయి ఏర్పాట్లను పరిశీలించాం. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా, వైద్య సదుపాయాలు మరియు ఇతర సదుపాయాలు పక్కాగా ఉండేలా చర్యలు తీసుకున్నాం.
సభకు వచ్చే ప్రజలకు, కార్యకర్తలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని వసతులు కల్పిస్తున్నాం. కూటమి ప్రభుత్వం ఇచ్చే మాటలకు, చేసే పనులకు కట్టుబడి పనిచేస్తోందని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.




