Proddatur: సీఎం, డిప్యూటీ సీఎం పర్యటన సమయంపై అసత్యాలు నమ్మొద్దు: ఎమ్మెల్యే

Proddatur: ప్రొద్దుటూరులో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన సమయాలపై వచ్చే పుకార్లు నమ్మవద్దని ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి స్పష్టం చేశారు.

P. GURUSWAMI, PRODDUTUR
Published on: 4 Oct 2026 8:12 PM IST
Proddatur
X

Proddatur: సీఎం, డిప్యూటీ సీఎం పర్యటన సమయంపై అసత్యాలు నమ్మొద్దు: ఎమ్మెల్యే

Proddatur: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ ప్రొద్దుటూరుకు పర్యటన భాగంగా ​రేపు ఉదయం 10:00 గంటలకు వారు సభా స్థలానికి చేరుకుంటారు.

​ఉదయం 10:30 గంటలకు ముఖ్యమంత్రి ఖచ్చితంగా వేదికపైకి వస్తారు. మధ్యాహ్నం 12:00 లేదా 12:15 గంటలకల్లా పూర్తవుతాయి. సోషల్ మీడియాలో వచ్చే వేరే ఇతర సమయాలను నమ్మవద్దని, ప్రజలు, అభిమానులు ఉదయం 8:30 నుండి 9:00 గంటల లోపు వేదిక వద్దకు చేరుకోవాలని ఎమ్మెల్యే కోరారు.

​అభివృద్ధి కార్యక్రమాలు, "జల్ జీవన్ మిషన్" ఈ పర్యటన సందర్భంగా ప్రొద్దుటూరులో లాంచ్ చేయాల్సిందిగా కోరినట్లు తెలిపారు. ప్రొద్దుటూరు అభివృద్ధికి సంబంధించి పలు అంశాలను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి మంజూరు చేయిస్తామని ఎమ్మెల్యే వెల్లడించారు.

P. GURUSWAMI, PRODDUTUR

P. GURUSWAMI, PRODDUTUR