Badvel: బద్వేల్ అభివృద్ధికి రూ.27 కోట్లు మంజూరు - వర్చువల్ శంకుస్థాపన!
Badvel: బద్వేల్ పట్టణంలో రూ.27 కోట్లతో మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులకు వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు. హాజరైన అధికారులు, నేతలు.
Badvel: బద్వేల్ అభివృద్ధికి రూ.27 కోట్లు మంజూరు - వర్చువల్ శంకుస్థాపన!
Badvel: బద్వేల్ పట్టణ మున్సిపాలిటీ పరిధిలోని మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులకు రూ. 27 కోట్లతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు. హైబ్రిడ్ యాన్యుటి మోడల్ పద్ధతిలో ఈ అభివృద్ధి పనులకు సంబంధించిన కార్యక్రమాన్ని నెల్లూరు రోడ్డులోని శ్రీ రాఘవేంద్ర గ్రాండ్ కల్యాణ మండపంలో ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకుల సమక్షంలో నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి బద్వేల్ డివిజనల్ అధికారి ఎ. చంద్రమోహన్, బద్వేల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మంచురి సూర్యనారాయణ రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో ఏ.చంద్రమోహన్ మాట్లాడుతూ బద్వేల్ పట్టణ అభివృద్ధి పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని అందులో భాగంగా రూ.27 కోట్లతో పట్టణంలోని రహదారులు, పార్కులు, డ్రైనేజీ, పనులు మరియు త్రాగునీరు వంటి మౌలిక వసతులు వంటివి మెరుగుపడతాయని ఆయన అన్నారు.
టిడిపి ఇన్చార్జి మంత్రి సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ బద్వేల్ పట్టణ అభివృద్ధి పై టిడిపి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని అందులో భాగంగా రూ..27 కోట్లతో మౌలిక వసతులు కల్పించడంలో పలు అభివృద్ధి పనులు చేపట్టటం సంతోషంగా ఉందని అన్నారు. రహదారులు, పార్కు, త్రాగునీరు, డ్రైనేజీ వంటి అభివృద్ధి పనులు బద్వేల్ పట్టణ పరిధిలో చేయటం వలన ప్రజలకు మెరుగైన జీవన విధానంతో పాటు, సౌకర్యమైన వసతులు లభిస్తాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమం బద్వేల్ మున్సిపల్ కమిషనర్ కృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించబడింది.
ఈ వర్చువల్ శంకుస్థాపన కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, ప్రభుత్వ అధికారులు,టిడిపి నాయకులు, కార్యకర్తలు, పొదుపు గ్రూపు మహిళలు, పట్టణ ప్రజలు భారీగా పాల్గొన్నారు.




