Proddatur: ఈ నెల 5న ప్రొద్దుటూరులో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్

Proddatur: ఈ నెల 5వ తేదీన కడప జిల్లా ప్రొద్దుటూరులో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జల్ జీవన్ మిషన్ పనుల ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారు.

P. GURUSWAMI, PRODDUTUR
Published on: 2 Oct 2026 3:52 PM IST
Proddatur
X

Proddatur: ఈ నెల 5న ప్రొద్దుటూరులో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్

కడప జిల్లా: ప్రొద్దుటూరులో ఈనెల 5వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా వీరిద్దరూ కలిసి ప్రొద్దుటూరుకు వస్తుండటంతో స్థానిక నేతలు, ప్రజల్లో తీవ్ర ఉత్కంఠ, ఉత్సాహం నెలకొంది. ​

జల్ జీవన్ మిషన్ కార్యక్రమంలో భాగంగా వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు సీఎం, డిప్యూటీ సీఎం వస్తున్నట్లు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి వెల్లడించారు.

ఈ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు ప్రస్తుతం అత్యంత వేగంగా సాగుతున్నాయి. ​బహిరంగ సభకు ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉండటంతో, వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు, నీడ, పార్కింగ్ వంటి అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.

ఈ చారిత్రాత్మక పర్యటనను మరియు బహిరంగ సభను ప్రజలు, కూటమి శ్రేణులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి పిలుపునిచ్చారు.

P. GURUSWAMI, PRODDUTUR

P. GURUSWAMI, PRODDUTUR