Punganur: హెల్మెట్ ధరించడం శ్రేయోదాయకం: రూరల్ సీఐ సాయి ప్రసాద్!
Punganur: ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి: పుంగనూరు రూరల్ సీఐ సాయి ప్రసాద్. చిట్రెడ్డిపల్లి వద్ద వాహనాల తనిఖీలు, హెల్మెట్ లేని వారికి జరిమానాలు, కౌన్సిలింగ్.
Punganur: హెల్మెట్ ధరించడం శ్రేయోదాయకం: రూరల్ సీఐ సాయి ప్రసాద్!
పుంగనూరు: ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ప్రయాణించాలని, హెల్మెట్ ప్రాణ రక్షణ కవచమని పుంగనూరు రూరల్ సీఐ సాయి ప్రసాద్ సూచించారు. సోమవారం చౌడేపల్లి - పలమనేరు ప్రధాన రహదారిలోని చిట్రెడ్డిపల్లి వద్ద పోలీసు సిబ్బందితో కలిసి ఆకస్మిక వాహన తనిఖీలు చేపట్టారు.
ఈ సందర్భంగా హెల్మెట్ లేకుండా వాహనాలు నడుపుతున్న ప్రయాణికులను ఆపి, నిబంధనల ప్రకారం జరిమానాలు విధించారు. అనంతరం వారికి హెల్మెట్ వాడకంపై ప్రత్యేక అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా సీఐ సాయి ప్రసాద్ మాట్లాడుతూ ప్రయాణంలో చిన్నపాటి నిర్లక్ష్యం కుటుంబాలకు తీరని శోకాన్ని మిగులుస్తుందని, ప్రతి ఒక్కరూ రహదారి భద్రతా నియమాలు పాటించాలని కోరారు. ద్విచక్ర వాహనం ఎక్కే ప్రతి ఒక్కరూ తమ భద్రత కోసం స్వచ్ఛందంగా హెల్మెట్ ధరించాలన్నారు.
ప్రమాదాలు జరిగినప్పుడు తలకు తీవ్ర గాయాలు కాకుండా హెల్మెట్ ఎంతగానో కాపాడుతుందని, పోలీసుల జరిమానాల కోసం కాకుండా ప్రాణ రక్షణ కోసమే హెల్మెట్ ధరించాలని స్పష్టం చేశారు. రూల్స్ అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.




