Chinnamandem: చిన్నమండెం టిడిపి కార్యకర్తల సమావేశంలో డాక్టర్ మండిపల్లి
Chinnamandem: చిన్నమండెం మండల TDP కార్యాలయంలో జడ్పీటీసీ అభ్యర్థి డాక్టర్ మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి ఆత్మీయ సమావేశం. పోలింగ్ సరళి, క్షేత్రస్థాయి శ్రమపై సుదీర్ఘ చర్చ.
Chinnamandem: చిన్నమండెం టిడిపి కార్యకర్తల సమావేశంలో డాక్టర్ మండిపల్లి
చిన్నమండెం: చిన్నమండెం మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జడ్పీటీసీ అభ్యర్థి డాక్టర్ మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి విచ్చేసిన ఆయనకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఘన స్వాగతం పలికారు. వారి ఉత్సాహభరిత స్వాగతం పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపింది.
ఈ సందర్భంగా నిన్న జరిగిన జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ సరళి, గ్రామాల వారీగా ప్రజల స్పందన, ఎన్నికల సమయంలో నాయకులు, కార్యకర్తలు చేసిన కృషిపై ఆత్మీయంగా చర్చించారు. క్షేత్రస్థాయిలో ఎదురైన పరిస్థితులను, ఎన్నికల అనుభవాలను నాయకులు, కార్యకర్తలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా డాక్టర్ మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారు మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ప్రతి నాయకుడికి, కార్యకర్తకు, అభిమానికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. కార్యకర్తల కష్టం, నాయకుల సహకారం, ప్రజల అభిమానం తనకు ఎప్పటికీ మరిచిపోలేని బలమని పేర్కొన్నారు.
ఎన్నికల ఫలితాలకు అతీతంగా ప్రజలతో, కార్యకర్తలతో తన అనుబంధం ఎప్పటికీ కొనసాగుతుందని, చిన్నమండెం అభివృద్ధి కోసం అందరినీ కలుపుకొని ముందుకు సాగుతానని తెలిపారు.
ఈ తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు మూగి రెడ్డప్ప గారు మరియు కార్యకర్తల అభిమానం… నాయకుల ఐక్యత… ప్రజల ఆశీస్సులే తనకు కొండంత బలమని ఈ ఆత్మీయ సమావేశం మరోసారి చాటిచెప్పింది.




