Chinnamandem: రైతుల పొలాల దారి సమస్య పరిష్కరించాలి: సీపీఐ(ఎంఎల్)
Chinnamandem: చిన్నమండెం మండలం సాకిబండ చెరువు కింద 50 ఎకరాల పొలాలకు వెళ్లే దారి సమస్యను తక్షణమే పరిష్కరించాలని సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ పార్టీ డిమాండ్ చేసింది.
Chinnamandem: రైతుల పొలాల దారి సమస్య పరిష్కరించాలి: సీపీఐ(ఎంఎల్)
అన్నమయ్య జిల్లా: చిన్నమండెం రైతుల పొలాల వద్దకు పోయే దారి సమస్యను వెంటనే పరిష్కరించాలని సిపిఐ (ఎంఎల్) లిబరేషన్ పార్టీ అన్నమయ్య జిల్లా కార్యదర్శి మావులూరి విశ్వనాథ్ డిమాండ్ చేశారు. సోమవారం చిన్నమండెం మండలం సాకిబండ గ్రామం సాకిబండ చెరువు కింద సాగులో ఉన్న సర్వే నెంబర్. 255/4. వద్ద పొలాల వద్ద కు పోయే దారి సమస్యను ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా సిపిఐ (ఎంఎల్ )లిబరేషన్ పార్టీ అన్నమయ్య జిల్లా కార్యదర్శి మావులూరి విశ్వనాధ. మాట్లాడుతూ బలిజ పల్లె రైతులకు. సంబంధించిన సుమారు 50 ఎకరాలు పొలాలలు వద్దకు పోవడానికి దారిని కచ్చితంగా వదలాలన్నారు.
రెవిన్యూ అధికారులు వెంటనే స్పందించాలని రైతులు వాపోతున్నారన్నారు. ఇప్పటికైనా అధికారులు రైతుల ఇబ్బందులను గుర్తించి దారి సమస్యను పరిష్కరించాలని అన్నారు. పొలాల వద్దకు పోవడానికి దారి ఇంతవరకు లేని ఇబ్బందులు ఇప్పుడు కలిగిస్తున్నారు. పొలాల దగ్గరికి పోవడానికి దారి లేకపోతే మా భూములు మేము అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని రైతులు వాపోతున్నారు.
ఇదే సమస్యపై ఆర్డిఓ గారికి వినతి పత్రం సమర్పించిన కూడా మా సమస్యను పరిష్కారం చేయలేదని రైతులు తెలిపారన్నారు మా పొలాల వద్దకు పోవడానికి మా పూర్వీకుల నుండి దారి ఉండేదన్నారు అయితే ఈ మధ్యకాలంలో దారి లేకపోవడం వలన నాన్న ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని ఒకరు ఇద్దరు వలన సుమారు 20 కుటుంబాలు రైతులు ఇబ్బందులు పడతున్నారని తక్షణమే రెవిన్యూ అధికారులు స్పందించి రైతులకు దారి సమస్యను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.
లేనిపక్షంలో సిపిఐ (ఎంఎల్ )లిబరేషన్ లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో రైతుల పక్షాన ఆందోళన కార్యక్రమాలు మరింత ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతులు బి రాజన్న డి నారాయణ బి రామ్మూర్తి బి యశోద బి రత్నమ్మ పి అలివేలమ్మ డి సుహాసిని పి చలపతి గిరిజా కె చలపతి తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
అభినందనలతో
మావులూరి( విశ్వనాథ్ )
సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి.




