Chinnamandem: చిన్నమండెంలో మహిళా సమైక్య సభ్యులకు బాలల రక్షణపై అవగాహన!
Chinnamandem: చిన్నమండెం మండలంలో మహిళా సమైక్య సభ్యులకు బాలల రక్షణపై అవగాహన సదస్సు. 1098, 112 టోల్ ఫ్రీ నెంబర్ల ప్రాముఖ్యతను వివరించిన చైల్డ్ హెల్ప్‌లైన్ సిబ్బంది.
Chinnamandem: చిన్నమండెంలో మహిళా సమైక్య సభ్యులకు బాలల రక్షణపై అవగాహన!
Chinnamandem: చిన్నమండెం మండలం మహిళా సమైక్య సభ్యులకు మిషన్ వాస్తవ చైల్డ్ హెల్ప్ లైన్ లో సిబ్బంది ఆధ్వర్యంలో బాలల రక్షణ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బాలల రక్షణ చైల్డ్ హెల్ప్ లైన్ సిబ్బంది పిల్లల దత్తత ప్రక్రియ నిర్మూలనతో పాటు బాల కార్మికుల నిర్మూలన తదితర అంశాలపై మహిళా సంఘాలకు అవగాహన కల్పించారు.
మిషన్ వాస్తవ చైల్డ్ హెల్ప్ లైన్ లో సిబ్బంది నజీర, శిరీష మాట్లాడుతూ 1098,112 టోల్ ఫ్రీ నెంబర్ల ప్రాముఖ్యత గురించి మహిళలుకు అర్థమైయ్యే విధంగా వివరించారు. నేటి బాల బాలికలు పరిరక్షణకు సంబంధించిన ఇబ్బందులు ఉంటే 1098, 112 నెంబర్లు సమాచారం ఇవ్వవలసిందిగా తెలిపారు. జిల్లాలో బాల్య వివాహాలను అరికట్టాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో మిషన్ వాస్తవ చైల్డ్ హెల్ప్ లైన్ లో సిబ్బంది నజీరా, శిరీషతో పాటు మహిళా సమాఖ్య సభ్యులు పాల్గొన్నారు.




