Ramasamudram: రామసముద్రం జడ్పీటీసీ అభ్యర్థిగా చంద్రకళ నామినేషన్!

Ramasamudram: అన్నమయ్య జిల్లా మదనపల్లె నియోజకవర్గం రామసముద్రం మండలం వైకాపా జడ్పీటీసీ అభ్యర్థిగా చంద్రకళ నామినేషన్ దాఖలు. వివరాలు వెల్లడించిన భర్త ఆనంద్.

Srinivasulu, Madanapalle
Published on: 21 Oct 2026 7:39 PM IST
Ramasamudram
X

Ramasamudram: రామసముద్రం జడ్పీటీసీ అభ్యర్థిగా చంద్రకళ నామినేషన్!

రామసముద్రం: మదనపల్లె నియోజకవర్గంలోని రామసముద్రం మండలం కురిజల పంచాయతీకి చెందిన దొడ్డిపల్లి ఆనంద్ భార్య చంద్రకళ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున జడ్పీటీసీ అభ్యర్థిగా బుధవారం నామినేషన్ దాఖలు చేశారు.

నిమ్మనపల్లి రోడ్డులోని జీఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రంలో ఎన్నికల అధికారులకు తన నామినేషన్ పత్రాలను అందజేశారు.

చంద్రకళ భర్త దొడ్డిపల్లి ఆనంద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, పార్టీ తరఫున జడ్పీటీసీ అభ్యర్థిగా తన భార్య చంద్రకళ నామినేషన్ దాఖలు చేసినట్లు తెలిపారు. రామసముద్రం మండల ప్రజల మద్దతుతో ఎన్నికల్లో విజయం సాధించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle