Proddatur: రెండో మైసూర్ ప్రొద్దుటూరులో ఘనంగా శమీ దర్శనం

Proddatur: దేశంలోనే రెండో మైసూర్‌గా ప్రసిద్ధిగాంచిన ప్రొద్దుటూరులో దసరా శరన్నవరాత్రులు ముగిశాయి. వైభవంగా జరిగిన అమ్మవార్ల శమీ దర్శనానికి వేలాదిగా భక్తులు తరలివచ్చారు.

P. GURUSWAMI, PRODDUTUR
Published on: 20 Oct 2026 8:03 PM IST
Proddatur
X

Proddatur: రెండో మైసూర్ ప్రొద్దుటూరులో ఘనంగా శమీ దర్శనం

Kadapa: దసరా ఉత్సవాల్లో దేశంలోనే రెండో మైసూర్ గా పేరుగాంచిన కడప జిల్లా ప్రొద్దుటూరులో దసరా శరన్నవరాత్రులు అంగరంగ వైభవంగా పూర్తయి ఈరోజు చివరి రోజు శమీ దర్శనానికి బయలుదేరిన అమ్మవారు. ప్రొద్దుటూరు పురవీధుల్లో దేవాలయాల అమ్మవార్లను ఊరేగింపులుగా తీసుకొని జమ్మి చెట్టు వద్ద ప్రత్యేక పూజలు పూర్తి చేసి అంగరంగ వైభవంగా భక్తులకు అమ్మవారు దర్శనమిచ్చారు.

అమ్మవారి శమీ దర్శన మహోత్సవం వైభవంగా నిర్వహించారు. వాసవి కన్యకా పరమేశ్వరి, శివాలయం చెన్నకేశవ స్వామి, రాజరాజేశ్వరి దేవి, చౌడేశ్వరి దేవి, అమ్మవార్లను శోభాయ మానంగా అలంకరించారు. శమీ దర్శనంలో శోభాయ మానంగా అమ్మవార్లను దర్శించుకోవడానికి వేలాదిమంది భక్తులు తరలి వచ్చారు.

కళాకారులు, నృత్య ప్రదర్శనలు, బాణసంచా పేలుళ్లు, కేరళ డ్రమ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అనంతరం శోభాయమానంగా తొట్టిమిరమని నిర్వహించనున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

P. GURUSWAMI, PRODDUTUR

P. GURUSWAMI, PRODDUTUR