Mydukur: ధరణి తిమ్మాయపల్లెలో ఘనంగా ఎడ్ల బండలాగుడు పోటీలు
Mydukur: మైదుకూరు ధరణి తిమ్మాయపల్లెలో అవధూత కొండయ్య స్వామి 45వ జన్మదినం సందర్భంగా 13 జతల ఎడ్లతో నిర్వహించిన బండలాగుడు పోటీలు ఘనంగా ముగిశాయి.
Mydukur: ధరణి తిమ్మాయపల్లెలో ఘనంగా ఎడ్ల బండలాగుడు పోటీలు
మైదుకూరు: మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని ధరణి తిమ్మాయపల్లె గ్రామంలో వెలసిన అవధూత కొండయ్య స్వామి 45వ జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా శనివారం మూడవ రోజు ఎడ్ల బండలాగుడు పోటీలలో 13 జతల ఎద్దులు పోటీలో పాల్గొన్నాయి. ఎద్దులు పోటీలను ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించారు.
ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలకు కొండయ్య స్వామి చేతులు మీదుగా నగదు బహుమతులను అందజేశారు:
మొదటి బహుమతి: ₹1,58,118
రెండవ బహుమతి: ₹1,08,118
మూడవ బహుమతి: ₹75,118
నాల్గవ బహుమతి: ₹50,118
ఐదవ బహుమతి: ₹25,118
పోటీలను తిలకించేందుకు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు, భక్తులు తరలివచ్చారు. ఈ సందర్భంగా భక్తులందరికీ కమిటీ ఆధ్వర్యంలో భారీ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.




