Rayachoti: స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి బీఎస్పీ ఆహ్వానం

Rayachoti: రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఎస్పీ తరఫున పోటీ చేసేందుకు ఆసక్తి గల అభ్యర్థులు సంప్రదించాలని యుగంధర్ అబ్బవరం పిలుపునిచ్చారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 10 Oct 2026 6:36 PM IST
Rayachoti
X

Rayachoti: స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి బీఎస్పీ ఆహ్వానం

Rayachoti: త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ (BSP) తరఫున పోటీ చేయడానికి ప్రజాసేవా దృక్పథం కలిగిన సమర్థవంతమైన అభ్యర్థులు ముందుకు రావాలని BSP అన్నమయ్య జిల్లా అధ్యక్షులు, రాయచోటి అసెంబ్లీ ఇన్‌చార్జి యుగంధర్ అబ్బవరం పిలుపునిచ్చారు.

యువత, మహిళలు, విద్యావంతులు, సామాజిక కార్యకర్తలు, SC, ST, BC, మైనారిటీ మరియు ఇతర బహుజన వర్గాలకు చెందిన అర్హులైన అభ్యర్థులకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. ప్రజాసేవ, సామాజిక న్యాయం, బహుజనుల రాజకీయ సాధికారత లక్ష్యంగా పనిచేయాలనుకునేవారు BSP తరఫున పోటీ చేసేందుకు ముందుకు రావాలని కోరారు.

ఆసక్తి గల అభ్యర్థులు

సంప్రదించవలసిన నంబర్: 9505508620

యుగంధర్ అబ్బవరం

అన్నమయ్య జిల్లా అధ్యక్షులు & రాయచోటి అసెంబ్లీ ఇన్‌చార్జి

బహుజన్ సమాజ్ పార్టీ (BSP), ఆంధ్రప్రదేశ్

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI