Brahmamgarimatham: రేకులకుంట హరిజనవాడలో నూతన స్మశాన వాటిక ప్రారంభం
Brahmamgarimatham: బ్రహ్మంగారిమఠం మండలం రేకులకుంట హరిజనవాడలో రూ.20 లక్షలతో నిర్మించిన స్మశాన వాటికను ప్రారంభించిన మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్.
Brahmamgarimatham: రేకులకుంట హరిజనవాడలో నూతన స్మశాన వాటిక ప్రారంభం
బ్రహ్మంగారిమఠం: బ్రహ్మంగారిమఠం మండలం రేకులకుంట హరిజనవాడ గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) నిధులు ₹20 లక్షలతో నిర్మించిన నూతన స్మశాన వాటికను మైదుకూరు ఎమ్మెల్యే శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్ గారు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని తెలిపారు. గ్రామాల అభివృద్ధిలో భాగంగా అవసరమైన అభివృద్ధి పనులను చేపట్టి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత పంచాయతీ నాయకులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.




