Brahmamgarimatham: పీహెచ్‌ఈసీలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహణ

Brahmamgarimatham: ప్రధానమంత్రి పిలుపు మేరకు బ్రహ్మంగారిమఠం పీహెచ్‌సీలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ప్రజలకు ఆరోగ్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు.

A. VEERA BHUPAL, MYDUKUR
Published on: 3 Oct 2026 7:28 PM IST
Brahmamgarimatham
X

Brahmamgarimatham: పీహెచ్‌ఈసీలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహణ

బ్రహ్మంగారి మఠం: మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు చేపట్టిన సేవా సంకల్ప్ అభియాన్ లో భాగంగా బ్రహ్మంగారిమఠం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు.ఈ శిబిరంలో గర్భవతులు,బాలింతలు,చిన్నారులు, వృద్ధులకు ఉచితంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు.

బీపీ,షుగర్ పరీక్షలు,సాధారణ జ్వరాలు,అంటువ్యాధులపై అవగాహన కల్పించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.పరిసరాల పరిశుభ్రత,పోషకాహారం,వ్యక్తిగత ఆరోగ్యంపై వైద్య సిబ్బంది అవగాహన కల్పించారు.అనంతరం ప్రభుత్వం అందిస్తున్న వైద్య సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్‌వైజర్లు పుష్పరాజ్,లక్ష్మీదేవి, హెల్త్ అసిస్టెంట్ మాధవ,సిహెచ్ఓ ప్రియాంక,ఫిమేల్ హెల్త్ అసిస్టెంట్లు వీర జ్యోత్స్న,విజయలక్ష్మి,ఆశా వర్కర్లు వీర భారతి,మల్లేశ్వరి,సుశీలమ్మ,రంగనాయకులమ్మ తదితర వైద్య సిబ్బంది అలాగే గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

A. VEERA BHUPAL, MYDUKUR

A. VEERA BHUPAL, MYDUKUR