Punganur: అక్టోబర్ 12 నుంచి బోయకొండ గంగమ్మ దసరా శరన్నవరాత్రులు!

Punganur: అన్నమయ్య జిల్లా బోయకొండ గంగమ్మ ఆలయంలో అక్టోబర్ 12 నుంచి 20 వరకు దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు. ఉభయదారుల రుసుము రూ. 5,116, ఆన్‌లైన్ చెల్లింపు వివరాలు విడుదల.

MAHESH, PUNGANOOR
Updated on: 22 Sept 2026 8:42 PM IST
Punganur
X

Punganur: అక్టోబర్ 12 నుంచి బోయకొండ గంగమ్మ దసరా శరన్నవరాత్రులు!

పుంగనూరు: ప్రసిద్ధ ప్రముఖ శక్తి క్షేత్రం శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానంలో ఈ ఏడాది దసరా శరన్నవరాత్రి మహోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఈవో ఉప కమిషనర్ ఏకాంబరం తెలిపారు అక్టోబర్ 12 నుండి 20 వరకు ఈ వేడుకలు అత్యంత వైభవంగా సంప్రదాయ బద్ధంగా నిర్వహిస్తున్నామన్నారు.

ఈ దసరా మహోత్సవాలలో పాల్గొనాలని భావించే ఉభయదారులు రూ. 5,116/-లు చెల్లించి అధికారిక రశీదు పొందవచ్చునన్నారు మరిన్ని వివరాలకు బోయకొండ కార్యాలయం నందు సంప్రదించాలని ఆయన కోరారు. అమ్మవారి దసరా మహోత్సవాలలో ఉభయదారులుగా పాల్గొనాలనుకున్న భక్తులు ఆన్లైన్ ద్వారా ఆలయ అకౌంట్ కు నగదును జమ చేసి రసీదును పొందవచ్చని ఆయన అన్నారు.

ఈ క్రింద కనబరచిన ఖాతాకు జమ చేయగలరు. ఉభయము నగదును జమ చేసిన తదుపరి ఆ వివరములను (UTR నెం) ను ఆలయ కార్యాలయానికి ఈ క్రింది నెంబర్ +91 70135 34222. తెలియజేయాలన్నారు వారికి రసీదు ను పోస్ట్ ద్వారా పంపుతామన్నారు.

బ్యాంకు వివరములు

SB A/c No: 650210002258661

Bank: Andhra Pradesh Grameena Bank,

Branch: Chowdepalli

IFSC Code: UBIN0CG7999

MAHESH, PUNGANOOR

MAHESH, PUNGANOOR