Boyakonda: రాజరాజేశ్వరీ దేవిగా బోయకొండ గంగమ్మ దర్శనం

Boyakonda: బోయకొండ గంగమ్మ ఆలయంలో దసరా నవరాత్రి ఉత్సవాలు ముగిశాయి. విజయదశమి సందర్భంగా అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరీ దేవి అలంకారంలో భక్తులకు దివ్యదర్శనమిచ్చారు.

MAHESH, PUNGANOOR
Published on: 20 Oct 2026 6:47 PM IST
Boyakonda
X

Boyakonda: రాజరాజేశ్వరీ దేవిగా బోయకొండ గంగమ్మ దర్శనం

Boyakonda: శ్రీ రాజరాజేశ్వరీ దేవిగా బోయకొండ గంగమ్మ అలంకారం, బోయకొండలో ముగిసిన దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు, శ్రీ రాజరాజేశ్వరీ దేవి హిందూ ధర్మంలో పరాశక్తికి, సకల బ్రహ్మాండాలకు అధిపతిగా పూజలందుకునే దివ్య స్వరూపం.

విశేషాలు:

మహారూపం: శ్రీ రాజరాజేశ్వరీ దేవిని మహాత్రిపుర సుందరి, లలితా దేవి, అపరాజితా దేవి అని కూడా పిలుస్తారు.

శరన్నవరాత్రులు: దేవీ శరన్నవరాత్రులలో పదవ రోజైన విజయదశమి నాడు అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. ఇది నవరాత్రి అలంకారాలలో చివరి రూపం.

దసరా శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా గత తొమ్మిది రోజుల నుండి అమ్మవారికి ప్రతిరోజు ప్రత్యేక అభిషేకాలు ప్రత్యేక అలంకారాలు నిర్వహించారు

ప్రతిరోజు ఉదయం అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలను నిర్వహించారు.

ఆలయ వేద పండితులు గోవర్ధన శర్మ ఆధ్వర్యంలో వేద పండితుల మంత్రచారణలతో గణపతి హోమం నవగ్రహ హోమం చండీ హోమాలన ఉభయదారులచే

నిర్వహించారు చివరి రోజు కావడంతో మహా చండీ హోమం తో పాటు మహా పూర్ణాహుతి పూజలను చేశారు.

ఉభయదారులకు ఆలయ మర్యాదలతో అమ్మవారి తీర్థ ప్రసాదాలతో పాటు మెమెంటో శేష వస్త్రాలు శలవలతో సత్కరించారు.

అనంతరం కలిస విసర్జన గావించి అమ్మవారికి అభిషేకం నిర్వహించి అభిషేక తీర్థాలను భక్తులకు పంపిణీ చేశారు అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అమ్మవారిని దర్శించుకున్న భక్తులకు అన్న ప్రసాదం భోజన వసతి ఏర్పాటు చేశారు.

MAHESH, PUNGANOOR

MAHESH, PUNGANOOR