Chinnamandem: వైసీపీకి షాక్: టీడీపీలో చేరిన వట్టం శేషారెడ్డి
Chinnamandem: చిన్నమండెం బెస్తపల్లి క్రాస్ వద్ద మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సమక్షంలో వైసీపీ నేత వట్టం శేషారెడ్డితో పాటు 100 కుటుంబాలు టీడీపీలో చేరారు.
Chinnamandem: వైసీపీకి షాక్: టీడీపీలో చేరిన వట్టం శేషారెడ్డి
చిన్నమండెం: చిన్నమండెం మండలం బెస్తపల్లి క్రాస్ సమీపంలోని ఫ్రూట్ మండి వద్ద ఆదివారం జరిగిన కార్యక్రమంలో పడమటికోన గ్రామం నడిగడ్డపల్లికి చెందిన వైసీపీ నాయకుడు వట్టం శేషారెడ్డి ఆయనతో పాటు సుమారు 100 కుటుంబాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు, ఆయన సతీమణి చిన్నమండెం మండల ఎంపీపీ మండిపల్లి హరితమ్మ గారు, చిన్నమండెం మండల జడ్పీటీసీ అభ్యర్థి డాక్టర్ మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారి సమక్షంలో ఈ చేరికల కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు వట్టం శేషారెడ్డితో పాటు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరిన 100 కుటుంబాలకు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజల్లో పెరుగుతున్న విశ్వాసానికి ఈ చేరికలు నిదర్శనమని మంత్రి పేర్కొన్నారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ సముచిత గౌరవం, ప్రాధాన్యత కల్పిస్తూ పార్టీ బలోపేతానికి కలిసికట్టుగా కృషి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు మూగి రెడ్డప్ప, పెద్దిరెడ్డి, ఎంపీటీసీలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మండిపల్లి అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




