Kadapa: వీరబల్లి జడ్పీ హైస్కూల్‌లో ఉత్తమ ఉపాధ్యాయునికి సన్మానం!

Kadapa: కడప జిల్లా వీరబల్లి జడ్పీ హైస్కూల్‌లో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందిన తెలుగు ఉపాధ్యాయుడు అనగాని రామ్మోహన్‌ను ఘనంగా సన్మానించారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 26 Sept 2026 2:12 PM IST
Kadapa
X

Kadapa: వీరబల్లి జడ్పీ హైస్కూల్‌లో ఉత్తమ ఉపాధ్యాయునికి సన్మానం!

Kadapa: కడప జిల్లా వీరబల్లి మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న అనగాని రామ్మోహన్ తెలుగు ఉపాధ్యాయులు గారికి ప్రధానోపాధ్యాయులు రెడ్డయ్య సార్ గారి చేతుల మీదుగా ఉపాధ్యాయులు విద్యార్థులందరి సమక్షంలో ఘనంగా సన్మానం చేశారు.

ప్రధానోపాధ్యాయులు రెడ్డయ్యగారు మాట్లాడుతూ రామ్మోహన్ గారు చక్కటి క్రమశిక్షణ కలిగి కాలాన్ని వృధా చేయకుండా విద్యార్థులకు చక్కగా తెలుగు బోధించేవారు అంతేకాకుండా విద్యార్థుల పుట్టినరోజు సందర్భంగా ప్రతి విద్యార్థి చేత మొక్కలు నాటించే వారు మరియు పాఠశాలలో పనిచేసే వంట మనసులకు , ఆయాలకు మరియు నైట్ వాచ్మెన్ లకు కొత్త బట్టలు పంపిణీ చేశారు.

రామ్మోహన్ గారు మాట్లాడుతూ ఇదే పాఠశాలలో విద్యార్థిగా చేరి, ఇదే పాఠశాలలో ఉపాధ్యాయునిగా చేరి ,ఇదే పాఠశాలలో ఉత్తమ ఉపాధ్యాయునిగా అవార్డు తీసుకోవడం నా పూర్వ జన్మ సుకృతం అని తెలిపారు.

ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ కొంత మంది ఉపాధ్యాయలకు అవార్డు పేరు తెస్తే రామ్మోహన్ సార్ గారు అవార్డుకే గౌరవం తెచ్చారు అని అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల బోధన, బోధనేతర సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI