Badvel: వైఎస్సార్సీపీ సర్పంచ్ అభ్యర్థి కుప్పల వెంకటరమణ టీడీపీలో చేరిక!
Badvel: కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం అనంతరాజుపురం పంచాయతీ వైఎస్సార్సీపీ సర్పంచ్ అభ్యర్థి కుప్పల వెంకటరమణ టీడీపీ ఇంచార్జ్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు.
Badvel: వైఎస్సార్సీపీ సర్పంచ్ అభ్యర్థి కుప్పల వెంకటరమణ టీడీపీలో చేరిక!
బద్వేల్: బద్వేల్ నియోజకవర్గం, అనంతరాజుపురం గ్రామ పంచాయతీ పరిధిలోని గుండం రాజుపల్లె గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ సర్పంచ్ అభ్యర్థి శ్రీ కుప్పల వెంకటరమణ వైఎస్సార్సీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. బద్వేల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ శ్రీ మంచూరు సూర్యనారాయణ రెడ్డి సమక్షంలో ఆయన టీడీపీ కండువా కప్పుకున్నారు.
కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై, మంచూరు సూర్యనారాయణ రెడ్డి నాయకత్వంపై నమ్మకంతో తెలుగుదేశం పార్టీలో చేరినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మంచూరు సూర్యనారాయణ రెడ్డి ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.




