Badvel: మానవత్వం చాటుకున్న యువత.. అనాథ వృద్ధురాలికి గౌరవప్రద అంత్యక్రియలు
Badvel: బ్రహ్మంగారిమఠం నందిపల్లి సమీపంలో లభ్యమైన అనాథ వృద్ధురాలి మృతదేహానికి బద్వేలు యువకులు మానవతా దృక్పథంతో గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహించారు.
Badvel: మానవత్వం చాటుకున్న యువత.. అనాథ వృద్ధురాలికి గౌరవప్రద అంత్యక్రియలు
బద్వేలు: మానవత్వం చాటుకున్న యువత.. ఆపన్నులకు అండగా నిలిచిన యువహృదయాలు! కన్నవారు ఎవరో తెలియదు.. బంధువులు ఎవరో తెలియదు.. చివరి మజిలీలో తోడుగా నిలిచేవారు కూడా ఎవరూ లేరు. అయినప్పటికీ ఆ వృద్ధురాలికి మేమున్నామంటూ ముందుకొచ్చారు బద్వేలు యువకులు.
బ్రహ్మంగారిమఠం మండలం నందిపల్లి బ్రిడ్జి సమీపంలోని అమ్మవారి ఆలయం వద్ద బుధవారం ఉదయం గుర్తుతెలియని వృద్ధురాలి మృతదేహాన్ని బ్రహ్మంగారిమఠం పోలీసులు గుర్తించారు.
ఈ విషయాన్ని సంబంధిత నాగిశెట్టిపల్లె గ్రామ పంచాయతీ కార్యదర్శి సిద్దు గారు తెలియజేయడంతో స్పందించిన బద్వేలు యువకులు రుద్రశివ, యూట్యూబర్ కడప నాగిరెడ్డి,రవి, చందు, మహబూబ్ బాషా, రాజు ముందుకొచ్చి ఆ వృద్ధురాలికి అంత్యక్రియలు నిర్వహించారు.
ఎవరూ లేని అనాథ మృతదేహానికి ఆత్మీయుల్లా నిలిచి, గౌరవప్రదంగా అంతిమ సంస్కారాలు నిర్వహించి తమలోని మానవత్వాన్ని చాటుకున్నారు. మనిషి బతికున్నప్పుడు మాత్రమే కాదు.. మరణించిన తర్వాత కూడా గౌరవం దక్కాలనే గొప్ప సందేశాన్ని ఈ యువకులు సమాజానికి చాటిచెప్పారు.
నిజమైన సేవ అంటే ఇదే.. మానవత్వమే మనిషికి అసలైన ఆభరణమని నిరూపించిన బద్వేలు యువకులకు అభినందనలు.




