Badvel: టీడీపీలో వర్గపోరు భగ్గుమంటున్న అసమ్మతి సెగలు
Badvel: బద్వేల్ టీడీపీలో భగ్గుమన్న వర్గపోరు. ఇన్చార్జ్ మంచూరి సూర్యనారాయణ రెడ్డి తీరుపై మాజీ ఎమ్మెల్యే విజయమ్మ వర్గం ధ్వజం. పార్టీ మారేందుకైనా సిద్ధమంటూ హెచ్చరిక.
Badvel: టీడీపీలో వర్గపోరు భగ్గుమంటున్న అసమ్మతి సెగలు
బద్వేల్: కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం లోని అన్ని మండలాలకు చెందిన మండల నాయకులు,పంచాయతీ పరిధిలోని నాయకులు మాజీ ఎమ్మెల్యే విజయమ్మ వర్గం గా ఏర్పడి స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా ఈ సమావేశంలో పాల్గొన్నారు. టిడిపి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత నియోజకవర్గ ఇన్చార్జి మార్పు అనంతరం ప్రస్తుత పరిస్థితుల ను దృష్టిలో ఉంచుకొని నాయకులు,, కార్యకర్తలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
ఇందులో భాగంగా వద్దిబోయిన ప్రసాద్ రెడ్డి ఏ. పి. ఐ. ఐ. సి. స్టేట్ డైరెక్టర్ మాట్లాడుతూ మొన్నటికి మొన్న బద్వేల్ నియోజకవర్గ టిడిపి నూతన ఇంచార్జ్ మంచూరి సూర్యనారాయణ రెడ్డి తమ మండలంలో పర్యటించి గ్రామంలో ఉన్న జడ్పిటిసి స్థాయి నాయకులను పార్టీ సమావేశానికి ఆహ్వానించకుండా, పూర్వం నుంచి టిడిపిలో ఉన్న నాయకులను నిర్లక్ష్యం చేసి తన వర్గానికి అనుకూలమైన వారిని కలుపుకొని పోతూ పార్టీలో వర్గ విభేదాలను ప్రోత్సహిస్తున్నారని, ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగేటట్లయితే టిడిపి పార్టీని వదిలిపెట్టే దానికి తాము అందరం సిద్ధమని తెలిపారు.
ఇతర పార్టీల నుంచి తమకు ఆహ్వానం వచ్చినప్పటికీ టిడిపి పార్టీ పైన అభిమానంతో అలాగే పార్టీలో కొనసాగుతున్నామని తెలిపారు.ఈ పరిస్థితులలో ప్రస్తుతం ఇంచార్జ్ సూర్యనారాయణ రెడ్డిని, మాజీ ఎమ్మెల్యే విజయమ్మ వర్గాలతో చర్చించి రెండు వర్గాలను ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నం జరుగుతుందని తెలిపారు.
విజయమ్మ వర్గానికి చెందిన మరో నాయకుడు మాట్లాడుతూ విజయమ్మ వర్గం వైయస్సార్సీపి వారితో చేతులు కలిపి టిడిపి పార్టీకి నష్టం కలిగేలా తమ కార్యకలాపాలు ఉన్నాయని ఇటువంటి తప్పుడు సమాచారాన్ని సూర్యనారాయణ రెడ్డి తమ వర్గం ద్వారా పార్టీ హై కమాండ్ కు చేరవేయడం, అంతేకాకుండా తమ వర్గానికి మాత్రమే పనులు జరిగేలా అధికారులకు ఆదేశాలు జారీ చేయటం తో నిజమైన టిడిపి నాయకులకు పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ అన్యాయం జరుగుతుందని, వీటన్నిటిని తలుచుకుంటే చాలా అవమానకరంగా,బాధాకరంగా ఉందని తెలియజేశారు.
ఏది ఏమైనప్పటికీ బద్వేల్ నియోజకవర్గం లో అధికార టిడిపి పార్టీలో అసమ్మతి సెగలు తారాస్థాయికి చేరే పరిస్థితి ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని అసమ్మతి వర్గం సమావేశం కావటం పార్టీకి తీరని నష్టం జరుగుతుందని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
మరో నాయకుడు మాట్లాడుతూ కలసపాడు మండలంలో నిజమైన టిడిపి నాయకుడు, కార్యకర్తలకు ప్రాధాన్యం ఇవ్వకుండా ప్రస్తుతం ఇన్చార్జికి ఎవరైతే అనుకూలంగా ఉన్నారో వారికి మాత్రమే పదవులు కట్టబెట్టి,వారికి మాత్రమే ప్రభుత్వ కార్యాలయాలలో పనులు అయ్యేలా అధికారులకు హెచ్చరికలు జారీ చేసి పార్టీలో వర్గ విభేదాలను సృష్టిస్తున్నారని పార్టీ పైన అభిమానం గౌరవం ఉంటే అందరిని కలుపుకొని పోయే స్వభావాన్ని పక్కన పెట్టి ఇలా సొంత పార్టీ వారిపైనే మానసికంగా కక్ష సాధింపు చర్యలు తగవని అభిప్రాయపడ్డారు.
రాబోయే జెడ్పిటిసి, ఎంపిటిసి,మరియు సర్పంచ్, అలాగే మున్సిపల్ ఎన్నికలలో తమ వర్గం ఏ విధంగా ముందుకు వెళ్లాలి అనే దాని కోసం మాజీ ఎమ్మెల్యే విజయమ్మ గారి అనుమతితో వేల మంది కార్యకర్తలతో అభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నామని తెలిపారు.
తమ వర్గానికి చెందిన నాయకులకు కష్టం రావడానికి కారణం కేవలం తెలుగుదేశం పార్టీని గౌరవించి అభిమానించటం పార్టీ కోసం పనిచేయటమే అని, వేరే వర్గం వాళ్ళ లాగా మోసం చేసే నాయకులుగా ఉండినట్లు అయితే తమ వర్గానికి ఈ గతి పట్టదని మరో నాయకుడు తెలిపాడు.
అంతేకాకుండా విజయమ్మ వర్గానికి చెందిన టిడిపి నాయకులు అందరూ ప్రస్తుత ఇన్చార్జి కి అనుకూలంగా ఉన్నారని మిగిలిన కొంతమంది మాత్రమే అసమ్మతి వర్గానికి అనుకూలంగా ఉన్నారని తప్పుడు సమాచారాన్ని అధిష్ఠానికి చేరవేస్తున్నారని ఇటువంటి పుకారులను నమ్మవద్దని విజయమ్మ వర్గం నిజమైన టిడిపి కార్యకర్తలు, నాయకులు విజయమ్మ వెంటే ఉన్నారని అది వీలైనంత త్వరగా పార్టీ అధిష్టానానికి తెలిపే ప్రయత్నం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో స్టేట్ డైరెక్టర్లు, పట్టణ ఇన్చార్జి, మండల నాయకులు,పంచాయతీ పరిధిలోని నాయకులు, ఆర్యవైశ్య సంఘాల నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.




