Badvel: బద్వేల్ వైఎస్సార్సీపీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా రాచపూడి సాయి కృష్ణ!
Badvel: బద్వేల్ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా రాచపూడి వెంకట సాయి కృష్ణను వైఎస్సార్సీపీ ప్రకటించింది. ఎమ్మెల్సీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే సుధ, ఆదిత్య రెడ్డి ప్రకటన.
Badvel: బద్వేల్ వైఎస్సార్సీపీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా రాచపూడి సాయి కృష్ణ!
బద్వేల్: బద్వేల్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ రాచపూడి వెంకట సాయి కృష్ణ ని బద్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి, ఎమ్మెల్సీ శ్రీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధ గారు, నియోజకవర్గ యువ నాయకుడు, రాష్ట్ర విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శి దేవసాని ఆదిత్య రెడ్డి ప్రకటించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో రాచపూడి వెంకట సాయి కృష్ణ ను భారీ మెజార్టీతో గెలిపించడంతో పాటు, బద్వేల్ మున్సిపాలిటీలోని మొత్తం 40 వార్డుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఘనవిజయం సాధించేలా నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
రాచపూడి వెంకట సాయి కృష్ణ గారు గతంలో 2008, 2014 సంవత్సరాల్లో కౌన్సిలర్గా, 2021లో బద్వేల్ మున్సిపల్ వైస్ చైర్మన్గా బాధ్యతలు నిర్వహిస్తూ ప్రజలకు సేవలందించారని తెలిపారు. అదేవిధంగా ఆయన తండ్రి, దివంగత నేత రాచపూడి నాగభూషణం కూడా జెడ్పీటీసీ, సర్పంచ్, ఎంపీటీసీ వంటి వివిధ ప్రజాప్రతినిధి బాధ్యతలు నిర్వహించడంతో పాటు విద్యారంగంలోనూ విశేష సేవలందించారని పేర్కొన్నారు.
తండ్రి రాచపూడి నాగభూషణం గారి ప్రజాసేవా వారసత్వాన్ని కొనసాగిస్తూ, ప్రజలతో సత్సంబంధాలు కలిగి, ప్రజా సమస్యలపై అవగాహనతో పనిచేసిన మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ సాయి కృష్ణ మున్సిపల్ చైర్మన్గా సేవలందించే అవకాశం కల్పించాలని వారు కోరారు.
కూటమి ప్రభుత్వం నుంచి ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు, ఇబ్బందులు ఎదురైనా వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ధైర్యంగా ఎదుర్కొని ఐకమత్యంతో ముందుకు సాగాలని, పార్టీ ఎల్లప్పుడూ కార్యకర్తలకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల మద్దతుతో బద్వేల్ మున్సిపాలిటీలోని అన్ని వార్డుల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించి, మరోసారి బద్వేల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. ఈ విజయాన్ని పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కానుకగా అందించాలని ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుదా , దేవసాని ఆదిత్య రెడ్డి ఆకాంక్షించారు.




