Badvel: బద్వేలు మున్సిపల్ చైర్‌పర్సన్‌గా డాక్టర్ దివ్య తేజ!
Badvel: కడప జిల్లా బద్వేలు మున్సిపాలిటీలో టీడీపీ రికార్డు విజయం సాధించింది. 39 వార్డులు ఏకగ్రీవం కాగా, చైర్‌పర్సన్‌గా డాక్టర్ సోమేశుల దివ్య తేజ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
Badvel: బద్వేలు మున్సిపల్ చైర్‌పర్సన్‌గా డాక్టర్ దివ్య తేజ!
బద్వేలు: మొత్తం బద్వేలు మున్సిపాలిటీలో 40 వార్డులు ఉండగా 39 వార్డులు ఏకగ్రీవంగా టిడిపి కౌన్సిలర్ అభ్యర్థులు ఎన్నిక కావడం జరిగింది. కేవలం 39 వ వార్డులో మాత్రమే ఎలక్షన్ జరిగే అవకాశాలు ఏర్పడ్డాయి. బద్వేల్ మున్సిపల్ చైర్ పర్సన్ డాక్టర్ సోమేశుల దివ్య తేజ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఈ కార్యక్రమంలో బద్వేల్ నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి సూర్యనారాయణ రెడ్డి మరియు పుత్త నరసింహారెడ్డి తదితర నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.
ఏకగ్రీవంగా ఎన్నికైన చైర్పర్సన్ మరియు కౌన్సిలర్లు తమకు ఈ అవకాశం కల్పించిన టిడిపి అధిష్టానానికి కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం చైర్పర్సన్ డాక్టర్ సోమేశుల దివ్య తేజ నియోజకవర్గ ఇన్చార్జి సూర్యనారాయణ రెడ్డిని శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలియజేశారు.




