Badvel: గోవింద రెడ్డి వ్యక్తిత్వం ఏంటో బద్వేల్ ప్రజలకు తెలుసు: సుధ!
Badvel: బద్వేల్ నియోజకవర్గంలో 25 ఏళ్లుగా సుపరిపాలన అందించిన గోవింద రెడ్డి వ్యక్తిత్వం ప్రజలందరికీ తెలుసని, టీడీపీ నేతల వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధ అన్నారు.
Badvel: గోవింద రెడ్డి వ్యక్తిత్వం ఏంటో బద్వేల్ ప్రజలకు తెలుసు: సుధ!
బద్వేలు: బద్వేలు నియోజకవర్గంలో గత 25 ఏళ్లుగా ఎటువంటి కక్షలు, కార్పన్యాలు లేకుండా సుపరిపాలన అందించిన గోవింద రెడ్డి వ్యక్తిత్వం ఏమిటో నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసని ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా పేర్కొన్నారు.ఇటీవల టిడిపి నేతలు ప్రెస్ మీట్ పెట్టి గోవింద రెడ్డి పై చేసిన వ్యాఖ్యలను ఆమె ఖండించారు.
శుక్రవారం ఎన్జీవో కాలనీలోని ఎమ్మెల్యే నివాసంలో ఆమె మాట్లాడుతూ ఒకసారి ఎమ్మెల్యేగా, రెండుసార్లు ఎమ్మెల్సీగా నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజల ఆధారాభిమానాలు చూరగొన్న నేత గోవింద రెడ్డి ఆని అన్నారు.అందుకే గత 25 ఏళ్లుగా నియోజకవర్గంలోని ప్రజలు అన్ని ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి అభ్యర్థులకు పట్టం కడుతూ వస్తున్నారని అన్నారు.
అంతేకాకుండా గత ప్రభుత్వ హయాంలో 2019- 2024 మధ్యకాలంలో మునుపెన్నడూ లేనివిధంగా బద్వేలు నియోజకవర్గాన్ని రూ.400 కోట్లతో అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. బద్వేలు నియోజకవర్గ అభివృద్ధి, నియోజకవర్గ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా గోవిందరెడ్డి పాలన అందించారని.. ఆ విషయం నియోజకవర్గంలోని ఏ ఒక్కరిని అడిగినా చెబుతారని అన్నారు.
గడచిన 25 ఏళ్ల కాలంలో నియోజకవర్గంలో ఏ ఒక్క ప్రతిపక్ష నేతనైనా గోవిందరెడ్డి ఇబ్బందుల గురిచేసారేమో, ఎన్నికలలో అక్రమాలకు అరాచకాలకు పాల్పడ్డారేమో తెలపాలని ప్రశ్నించారు. ఒక ప్రభుత్వ ఉన్నతాధికారిగా సేవలు అందించిన ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా అదే హుందా తనంతో పాలన అందించారని ఏ ఒక్క ప్రభుత్వ అధికారిని కూడా తక్కువ చేసి మాట్లాడిన చరిత్ర లేదని అన్నారు.
రాష్ట్రం లో కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తర్వాత జరిగిన ఎన్నికలలో అప్రజాస్వామ్య విధానాలకు పాల్పడి, అరాచకాలు సృష్టించి ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులను నామినేషన్ సైతం వేయకుండా అడ్డుకున్నారని అన్నారు.
బద్వేలు నియోజకవర్గం వైఎస్ఆర్ సీపీ కంచుకోట అని ప్రజాస్వామ్య విధానంలో ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ సీపీ అభ్యర్థుల విజయాన్ని ఎవరు కూడా ఆపలేరు అనే విషయాన్ని టిడిపి నేతలు గుర్తించాలని కోరారు. త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికలను ప్రజాస్వామ్య పద్ధతిలో పారదర్శకంగా నిర్వహించి గెలుపొందితే ఎవరి సత్తా ఏమిటో తెలుస్తుందని అన్నారు.




