Badvel: తైక్వాండో, బాక్సింగ్‌లో బద్వేల్ ఫాతిమా స్కూల్ ఘన విజయం

Badvel: బద్వేల్ ఫాతిమా ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు జిల్లా స్థాయి తైక్వాండో, బాక్సింగ్ పోటీల్లో రాణించి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు.

B. ARUN KUMAR, BADVEL
Published on: 29 Sept 2026 3:03 PM IST
Badvel
X

Badvel: తైక్వాండో, బాక్సింగ్‌లో బద్వేల్ ఫాతిమా స్కూల్ ఘన విజయం

బద్వేల్ (గోపవరం మండలం): కడప జిల్లా గోపవరం మండలం, బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని ఫాతిమా ఆంగ్ల మాధ్యమ పాఠశాల విద్యార్థులు క్రీడల్లో అద్భుత ప్రతిభ కనబరిచి పాఠశాలకు, ప్రాంతానికి గర్వకారణంగా నిలిచారు.

తైక్వాండోలో దివ్య సాహితి ప్రతిభ:

వైఎస్ఆర్ స్పోర్ట్స్ క్లబ్ (కడప) నందు 28-09-2026న నిర్వహించిన జిల్లా స్థాయి తైక్వాండో పోటీలలో ఫాతిమా పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న N. దివ్య సాహితి పాల్గొని అద్భుత విజయాన్ని అందుకుంది. జిల్లా స్థాయిలో విజేతగా నిలవడమే కాకుండా, తదుపరి జరగబోయే రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీలకు అర్హత సాధించింది.

బాక్సింగ్‌లో సాయి నిహాస్, రెహమాన్ హుస్సేన్ హవా:

అదేవిధంగా, పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న N. సాయి నిహాస్, 10వ తరగతి చదువుతున్న S. అయిమన్ హుస్సేన్ జిల్లా స్థాయిలో నిర్వహించిన బాక్సింగ్ పోటీల్లో ఘన విజయం సాధించారు. తమ ప్రతిభతో వీరు Under-14 మరియు Under-17 రాష్ట్ర స్థాయి (స్టేట్ లెవెల్) బాక్సింగ్ పోటీలకు ఎంపికయ్యారు.

విద్యార్థులకు ఘన సన్మానం:

రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థిని, విద్యార్థులను పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు (హెచ్.ఎమ్) సిస్టర్ జ్యోత్స్న గారు ప్రత్యేకంగా అభినందించి, శాలువాతో ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా సిస్టర్ జ్యోత్స్న గారు మాట్లాడుతూ.. విద్యార్థుల ఈ విజయానికి కృషి చేసిన ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులకు, వ్యాయామ దర్శకులకు (పి.టి) మరియు ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు మరియు అభినందనలు తెలియజేశారు. రాబోయే రాష్ట్ర స్థాయి పోటీల్లో కూడా విద్యార్థులు విజయం సాధించాలని ఆమె ఆకాంక్షించారు.

B. ARUN KUMAR, BADVEL

B. ARUN KUMAR, BADVEL