Annamayya: ఓపెన్ స్కూల్ ప్రవేశాల గడువు అక్టోబర్ 31 వరకు పెంపు
Annamayya: ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ పదో తరగతి, ఇంటర్ ప్రవేశాల గడువును ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఈ నెల 31 వరకు పొడిగించినట్లు డీఈవో తెలిపారు.
Annamayya: ఓపెన్ స్కూల్ ప్రవేశాల గడువు అక్టోబర్ 31 వరకు పెంపు
అన్నమయ్య జిల్లా: ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించే పదవ తరగతి, ఇంటర్మీడియట్ కోర్సుల్లో ప్రవేశాల గడువును ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఈ నెల 31వ తేదీ వరకు పొడిగించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ కె. సుబ్రహ్మణ్యం ఒక ప్రకటనలో తెలిపారు.
14 సంవత్సరాల వయస్సు నిండిన వారు పదవ తరగతిలో, పదవ తరగతి ఉత్తీర్ణులైన వారు ఇంటర్మీడియట్‌లో ప్రవేశాలు పొందవచ్చని తెలిపారు. తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ, ఒరియా భాషల్లో విద్యను అభ్యసించే అవకాశం ఉందన్నారు.
పాఠశాలకు వెళ్లే అవకాశం లేని వారు, మధ్యలో చదువు మానివేసిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఓపెన్ స్కూల్ ద్వారా పొందిన సర్టిఫికెట్లతో, రెగ్యులర్ విద్యార్థులకు ఏయే కోర్సుల్లో ప్రవేశానికి అర్హత ఉంటుందో, నిబంధనలకు అనుగుణంగా ఆయా కోర్సుల్లో ఓపెన్ స్కూల్ విద్యార్థులు కూడా ప్రవేశాలు పొందవచ్చని అన్నమయ్య జిల్లా ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ కొండూరు శ్రీనివాసరాజు తెలిపారు.




