Annamayya: మదనపల్లెలో సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి పర్యటన: బందోబస్తు!
Annamayya: అన్నమయ్య జిల్లా మదనపల్లెలో సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ పర్యటనకు ఎస్పీ ధీరజ్ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
Annamayya: మదనపల్లెలో సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి పర్యటన: బందోబస్తు!
Annamayya: అన్నమయ్య జిల్లా మదనపల్లె లో అక్టోబర్ 2వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, కేంద్ర మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారితో పాటు ఇతర రాష్ట్ర, జాతీయ స్థాయి ప్రముఖులు పర్యటించనున్న నేపథ్యంలో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ ప్రతిష్టాత్మక పర్యటనలో ఎలాంటి భద్రతా లోపాలకు తావులేకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ సందర్భంగా బుధవారం మదనపల్లెలోని ఆర్.ఆర్. ఫంక్షన్ హాల్‌లో బందోబస్తు విధుల్లో పాల్గొనే పోలీసు అధికారులు, సిబ్బందితో అన్నమయ్య జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్,. గారు. ప్రత్యేక బ్రీఫింగ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు స్వయంగా మ్యాప్ ద్వారా బందోబస్తు ప్లాన్‌ను పోలీసు అధికారులకు, సిబ్బందికి వివరించారు. ముఖ్యంగా వీఐపీలు హెలికాప్టర్‌లో దిగే హెలిప్యాడ్ వద్ద పటిష్టమైన భద్రతా వలయాల ఏర్పాటును ఆయన సమీక్షించారు. హెలిప్యాడ్ ప్రాంగణంలో తీసుకోవాల్సిన అదనపు జాగ్రత్తలను సూచించారు.
అనంతరం హెలిప్యాడ్ నుండి సభా ప్రాంగణానికి చేరుకునే కాన్వాయ్ రూట్ మ్యాప్, ట్రాఫిక్ మళ్లింపు, పార్కింగ్ ఏర్పాట్లు, జనసందోహం నియంత్రణ తదితర అంశాలపై అధికారులకు స్పష్టమైన బాధ్యతలను అప్పగించారు. ప్రముఖుల పర్యటన విజయవంతంగా, ప్రశాంత వాతావరణంలో ముగిసేలా ప్రతి అధికారి, సిబ్బంది అత్యంత అప్రమత్తంగా బాధ్యతలు నిర్వర్తించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలతో పాటు పలువురు డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు, పోలీసు మరియు ఏపీఎస్పీ సిబ్బంది పాల్గొన్నారు.




