Rayachoti: రాయచోటి నియోజకవర్గంలో వైయస్సార్సీపీకి భారీ షాక్!
Rayachoti: లక్కిరెడ్డిపల్లి చౌటపల్లి హరిజనవాడలో వైయస్సార్సీపీకి షాక్ తగిలింది. డాక్టర్ మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో వంద కుటుంబాలు టీడీపీలో చేరాయి.
Rayachoti: రాయచోటి నియోజకవర్గంలో వైయస్సార్సీపీకి భారీ షాక్!
Rayachoti: TDP కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన టిడిపి నాయకుడు డాక్టర్ మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి గారు లక్కిరెడ్డిపల్లి మండలం, చౌటపల్లి,హరిజనవాడ లో వైఎస్సార్‌సీపీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. వైఎస్సార్‌సీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు.
మండల టిడిపి అధ్యక్షుడు మదనమోహన్ ఆధ్వర్యంలో 100 కుటుంబాలకు పైగా టీడీపీ కండువాలు కప్పుకుని తెలుగుదేశం పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారందరికీ నియోజకవర్గ టిడిపి నాయకులు డాక్టర్ మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారు కండువాలు కప్పి సాదరంగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాయచోటి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీపై ప్రజల్లో రోజురోజుకూ విశ్వాసం పెరుగుతోందని, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో టీడీపీలో చేరుతున్నారని తెలిపారు.
తెలుగుదేశం పార్టీలో చేరిన ప్రతి ఒక్కరినీ సాదరంగా ఆహ్వానిస్తూ, వారికి పార్టీలో సముచిత గౌరవం కల్పిస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. రాయచోటి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండలాధ్యక్షుడు మదన్మోహన్,రమేష్ రెడ్డి, రామసుబ్బారెడ్డి, ఉమాపతి రెడ్డి,గురు స్వామి,రమ్య తదితర టీడీపీ నాయకులతో పాటు మండల నాయకులు, గ్రామ నాయకులు,కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు..




