Galiveedu: సుగవాసి ప్రసాద్ బాబుకు శంకర్ యాదవ్ హృదయపూర్వక అభినందనలు!
Galiveedu: గాలివీడు జడ్పీటీసీ ఎన్నికల్లో రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో విజయం సాధించిన రాజంపేట టీడీపీ అధ్యక్షులు సుగవాసి ప్రసాద్ బాబును తంబళ్లపల్లె ఇంచార్జి శంకర్ యాదవ్ అభినందించారు.
Galiveedu: సుగవాసి ప్రసాద్ బాబుకు శంకర్ యాదవ్ హృదయపూర్వక అభినందనలు!
రాయచోటి: అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం గాలివీడు మండల జడ్పీటీసీ ఎన్నికల్లో రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో చారిత్రాత్మక విజయం సాధించిన రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, జడ్పీటీసీ సభ్యులు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు గారిని తంబళ్లపల్లె టీడీపీ ఇంచార్జి శ్రీ శంకర్ యాదవ్ గారు మదనపల్లిలో తన టీడీపీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఇరువురు నాయకులు పరస్పరం శాలువాలతో సత్కరించుకుని శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ సందర్భంగా శంకర్ యాదవ్ గారు మాట్లాడుతూ “గాలివీడు మండల ప్రజలు సుగవాసి ప్రసాద్ బాబు గారిపై చూపించిన అపారమైన అభిమానం, నమ్మకానికి ఈ భారీ విజయం నిదర్శనం. ప్రజల ఆశీస్సులు, పార్టీ నాయకులు, కార్యకర్తల అంకితభావంతో సాధించిన ఈ విజయం ఎంతో ప్రత్యేకమైనది. భవిష్యత్తులో గాలివీడు మండల అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి ప్రసాద్ బాబు గారు మరింత కృషి చేయాలని ఆకాంక్షిస్తున్నాను. ఆయనకు మా పూర్తి సహకారం ఎల్లప్పుడూ ఉంటుంది” అని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా సుగవాసి ప్రసాద్ బాబు గారు తన విజయానికి సహకరించిన ప్రజలకు, పార్టీ నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తానని తెలిపారు. ఇది ఒక్కరి విజయం కాదు… ప్రజల అభిమానం, కార్యకర్తల కష్టం, తెలుగుదేశం కుటుంబ ఐక్యతకు నిదర్శనం.




