Rayachoti: ఓపెన్ స్కూల్ ద్వారా చదువు కొనసాగించండి: మంత్రి మండిపల్లి!

Rayachoti: ఆర్థిక స్థోమత లేక బడి మానివేసిన వారు, చిరుద్యోగులు ఓపెన్ స్కూల్ ద్వారా 10వ తరగతి, ఇంటర్మీడియట్ పూర్తి చేసి మంచి భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 13 Nov 2026 4:46 PM IST
Rayachoti
X

Rayachoti: ఓపెన్ స్కూల్ ద్వారా చదువు కొనసాగించండి: మంత్రి మండిపల్లి!

రాయచోటి: ఇంటి పరిస్థితులు సరిగా లేక బడి మానివేసిన వాళ్ళు, ఆర్ధిక స్థోమత లేని వారు, చిరుఉద్యోగులు ఓపెన్ స్కూల్ ద్వారా 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ లో చేరి మంచి భవిష్యత్తు కు బాటలు వేసుకోవాలని రాష్ట్ర రవాణా యువజన క్రీడల శాఖ మాత్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. ఈ ప్రాంతంలోని AI సెంటర్లను ఉపయోగించుకుని అందరూ ఓపెన్ స్కూల్లో చేరి పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ పాస్ కావాలన్నారు.

రాష్ట్ర కోఆర్డినేటర్ రవీంద్రనాథ్ గారు అన్నమయ్య జిల్లా రాయచోటి, డైట్ కళాశాలలో ఏర్పాటుచేసిన ఏఐ కోఆర్డినేటర్ల సమావేశంలో నియమ నిబంధనలపై పూర్తిగా చర్చించడం జరిగింది. అన్నమయ్య జిల్లా నందు అడ్మిషన్లను మరింత పెంచాలని రాష్ట్రస్థాయిలో నిర్దేశించిన స్థాయికి చేరాలన్నారు. ఈ ప్రాంత ఏఐ కోఆర్డినేటర్ల స్థితిగతులను విచారించడం జరిగింది.

ఈ సందర్భంగా ఈ ప్రాంతంలో వున్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మాసాపేట, ఉర్దూ పాఠశాల మరియు ప్రభుత్వ పాఠశాల నేతాజీ సర్కిల్ ఉపాధ్యాయులతో మాట్లాడి అడ్మిషన్ల పెంపుకు సహకరించవలసిందిగా కోరడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కోఆర్డినేటర్ కొండూరు శ్రీనివాస్ గారు మాట్లాడుతూ 14 సంవత్సరాల వయస్సు పూర్తి చేసిన వారు పదవ తరగతి లోను, పదవ తరగతి పూర్తి చేసిన వారు ఇంటర్మీడియట్ చేరవచ్చు అన్నారు.

ఓపెన్ స్కూల్ ద్వారా పొందిన సర్టిఫికెట్స్ రెగ్యులర్ విద్యార్థులు పొందిన సర్టిఫికెట్స్ కు సమానమన్నారు. రెగ్యులర్ విద్యార్థులతోపాటు ఏ కోర్సులో అయినా చేరవచ్చునని తెలియజేసిరి. డైట్ ఇన్చార్జి ప్రిన్సిపల్ మడితాడి నరసింహారెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయులు తన వంతు బాధ్యతగా తమ ఆవాస ప్రాంతాలలోని బడి మానివేసిన పిల్లలను ఓపెన్ స్కూల్ లో చేర్పించవలసిందిగా కోరారు. అదేవిధంగా ఇందులో ప్రవేశం పొంది అర్హత సాధించిన వారు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగాలలో చేరడానికి ఉపయోగపడుతాయన్నారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI