Rayachoti: అన్నమయ్య జడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్‌కు మంత్రి మండిపల్లి శుభాకాంక్షలు!

Rayachoti: అన్నమయ్య జిల్లా పరిషత్ నూతన చైర్మన్ సుగవాసి ప్రసాద్ బాబు, వైస్ చైర్మన్ తలారి శరణ్యలను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 20 Nov 2026 1:57 PM IST
Rayachoti
X

Rayachoti: అన్నమయ్య జడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్‌కు మంత్రి మండిపల్లి శుభాకాంక్షలు!

రాయచోటి: అన్నమయ్య జిల్లా పరిషత్ నూతన చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేయనున్న సుగవాసి ప్రసాద్ బాబు గారికి, వైస్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్న తలారి శరణ్య గారికి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా వారిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందించి అభినందించారు. నూతన బాధ్యతలతో అన్నమయ్య జిల్లా అభివృద్ధికి మరింత కృషి చేస్తూ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చేలా సమిష్టి కృషితో జిల్లా అభివృద్ధిలో నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టాలని మంత్రి ఆకాంక్షించారు. నూతనంగా బాధ్యతలు చేపట్టనున్న చైర్మన్, వైస్ చైర్మన్‌లకు భవిష్యత్తులో మరిన్ని విజయాలు చేకూరాలని మనస్ఫూర్తిగా అభిలషించారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI