Annamayya: స్థానిక ఎన్నికల వేళ ముమ్మరంగా పోలీసు తనిఖీలు!
Annamayya: అన్నమయ్య జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా విస్తృత వాహన తనిఖీలు. మేదరపల్లి చెక్‌పోస్ట్, సంబేపల్లి పరిధిలో ఎస్‌ఎస్‌టీ, పోలీసుల విజిబుల్ పోలీసింగ్.
Annamayya: స్థానిక ఎన్నికల వేళ ముమ్మరంగా పోలీసు తనిఖీలు!
అన్నమయ్య: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా భద్రతా తనిఖీలు ముమ్మరం. లక్కిరెడ్డిపల్లి సీఐ, రామాపురం ఎస్ఐ తమ సిబ్బంది మరియు SST టీమ్‌తో కలిసి మేదరపల్లి చెక్‌పోస్ట్ వద్ద విస్తృతంగా వాహనాలను తనిఖీ చేశారు.
రాయచోటి రూరల్ సీఐ, సంబేపల్లి ఎస్ఐ ఆధ్వర్యంలో సంబేపల్లి మండలంలో ముమ్మర వాహన తనిఖీలతో పాటు విజిబుల్ పోలీసింగ్ నిర్వహించారు.
ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి నగదు, మద్యం వంటివి అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా పోలీస్ యంత్రాంగం హెచ్చరించింది.




