Galiveedu: గాలివీడు మండలంలో పోలీసుల భారీ కవాతు!
Galiveedu: సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాలతో గాలివీడు మండలంలోని సమస్యాత్మక గ్రామాల్లో పోలీసులు భారీ రూట్ మార్చ్ నిర్వహించారు.
Galiveedu: గాలివీడు మండలంలో పోలీసుల భారీ కవాతు!
గాలివీడు: రాబోయే సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి, ఐపీఎస్,. గారి ఆదేశాల మేరకు లక్కిరెడ్డిపల్లె సీఐ హెచ్. కృష్ణంరాజు నాయక్, ఎస్సైలు జె. నరసింహారెడ్డి, జి. శోభల ఆధ్వర్యంలో గాలివీడు మండలంలోని పలు గ్రామాల్లో భారీ రూట్ మార్చ్ నిర్వహించారు. అత్యంత సమస్యాత్మక గ్రామమైన గాండ్లపల్లిలో ప్రత్యేక గ్రామసభ ఏర్పాటు చేసి, ఎన్నికల వేళ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.
ఓటర్లు ఎటువంటి భయభ్రాంతులకు గురికాకుండా నిర్భయంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా జరిగేలా ప్రజలందరూ పోలీస్ యంత్రాంగానికి పూర్తిస్థాయిలో సహకరించాలని అధికారులు కోరారు.




