Rayachoti: ఆలయాల పునర్నిర్మాణ పనులు నాణ్యతతో గడువులో పూర్తి చేయాలి!

Rayachoti: అన్నమయ్య జిల్లా రాయచోటి, పీలేరు, కలికిరి మండలాల్లో ఆలయాల పునర్నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలతో గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశించారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 13 Nov 2026 4:56 PM IST
Rayachoti
X

Rayachoti: ఆలయాల పునర్నిర్మాణ పనులు నాణ్యతతో గడువులో పూర్తి చేయాలి!

రాయచోటి: రాయచోటి పీలేరు, కలికిరి, జిల్లాలో వివిధ ఆలయాల పునర్నిర్మాణం, పునరుద్ధరణ కు ఇప్పటికే చేపట్టిన పనులను నాణ్యతా ప్రమాణాలతో, నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు.

శుక్రవారం కలెక్టర్ రాయచోటి, పీలేరు, కలికిరి, మండలాల్లో పర్యటించి వివిధ ఆలయాల్లో జరుగుతున్న పునర్నిర్మాణ పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆలయాల వారీగా మంజూరైన నిధులు, ఇప్పటివరకు చేపట్టిన పనులు, ప్రస్తుత పురోగతి తదితర వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.

రాయచోటి మండలం – శ్రీ దేవకీ యశోద కృష్ణ ఆలయం

రాయచోటి మండలం మాసాపేట పరిధిలోని శ్రీ దేవకీ యశోద కృష్ణ ఆలయ పునర్నిర్మాణ పనులను కూడా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ ఆలయ అభివృద్ధి పనుల కోసం రూ.కోటి నిధులు మంజూరయ్యాయి. ప్రస్తుతం పనులు కొనసాగుతున్నట్లు అధికారులు వివరించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..., ఆలయాల పునర్నిర్మాణ పనుల్లో నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని, మంజూరైన నిధులను నిర్దేశిత పనులకే వినియోగించాలని సూచించారు. ప్రతి ఆలయంలో చేపట్టిన పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తూ, నిర్ణీత గడువులోగా పనులన్నీ పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత దేవాదాయ శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI