Rayachoti: కూటమి నేతలతో ప్రత్యేక సమావేశం నిర్వహించిన మంత్రి మండిపల్లి!

Rayachoti: అన్నమయ్య జిల్లా నూతనంగా ఏర్పడిన బీ.కొత్తకోట మున్సిపాలిటీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పిలుపునిచ్చారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 18 Nov 2026 4:02 PM IST
Rayachoti
X

Rayachoti: కూటమి నేతలతో ప్రత్యేక సమావేశం నిర్వహించిన మంత్రి మండిపల్లి!

రాయచోటి: బీ.కొత్తకోట మున్సిపాలిటీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించాలని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పిలుపునిచ్చారు. నూతనంగా ఏర్పడిన బీ.కొత్తకోట మున్సిపాలిటీ చైర్మన్ అభ్యర్థి శ్రీనివాస్‌తో పాటు 24 మంది కౌన్సిలర్ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా మంత్రి అధ్యక్షతన కూటమి నాయకులు, కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మున్సిపాలిటీ అభివృద్ధి, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పన కోసం కూటమి అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ముందుకు సాగుతూ ప్రజల్లోకి వెళ్లి కూటమి ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించాలని కోరారు.

చైర్మన్ అభ్యర్థి శ్రీనివాస్‌తో పాటు 24 మంది కౌన్సిలర్ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో దామచర్ల సత్య, పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి, జడ్పీటీసీ ప్రసాద్ బాబు, శంకర్ యాదవ్‌తో పాటు పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI