Rayachoti: స్వగ్రామంలో ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి మండిపల్లి!
Rayachoti: అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలం బోరెడ్డిగారిపల్లెలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఓటు వేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ఘనవిజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
Rayachoti: స్వగ్రామంలో ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి మండిపల్లి!
రాయచోటి: అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలం పడమటికోన గ్రామం బోరెడ్డిగారిపల్లె లోని పోలింగ్ కేంద్రంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గ్రామాలలో స్థానిక సంస్థలు బలంగా ఉన్నప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ప్రశాంత వాతావరణంలో జడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు.
ప్రజలు అభివృద్ధికే పట్టం కడుతున్నారన్నారు. ఇటీవల జరిగిన పురపాలక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ప్రజల అఖండ మెజారిటీతో గెలిపించాలని అందులో భాగంగానే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కూటమి అభ్యర్థులు ఘనవిజయం సాధించబోతున్నారని ఆయన తెలిపారు. తన సొంత నియోజకవర్గమైన రాయచోటిలోని చిన్నమండెం సంబేపల్లి గాలివీడు మండలంలో జడ్పిటిసి స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయని
రెండున్నర ఏళ్లలో చేసిన అభివృద్ధి సంక్షేమమే ప్రజలలో కూటమి అభ్యర్థుల విజయానికి సోపానమని తెలుస్తోందన్నారు.ఎన్నికలు జరుగుతున్న తీరు చూస్తే తెలుగుదేశం అభ్యర్థులకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారనే విషయం అర్థమవుతుందన్నారు. అంతిమ తీర్పును ఏ రాజకీయ పార్టీ అయినా అంగీకరించాల్సిందేనని ఆయన తెలిపారు. ఇదే స్పూర్తితో 2029 ఎన్నికల్లో కూటమి పార్టీలు గెలుస్తోందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు.




