Brahmamgarimatham: ముడుమాల గ్రామంలో ఘనంగా అంగన్వాడీ ఉత్సవ్!
Brahmamgarimatham: ముడుమాల గ్రామంలో సేవా సంకల్ప అభియాన్ ఆధ్వర్యంలో అంగన్వాడీ ఉత్సవం, అంగన్వాడీ కార్యకర్తల సత్కారం మరియు చిన్నారులకు అన్నప్రాసన.
Brahmamgarimatham: ముడుమాల గ్రామంలో ఘనంగా అంగన్వాడీ ఉత్సవ్!
Brahmamgarimatham: సమాజ అభివృద్ధిలో అంగన్వాడీల పాత్ర కీలకమని భారత జనతా పార్టీ మండల అధ్యక్షులు పెద్దిరెడ్డి చంద్ర ఓబుల్ రెడ్డి అన్నారు. దేశ ప్రధాని మనందరి మార్గదర్శకులు గౌరవ శ్రీ నరేంద్ర మోడీ తన సుపరిపాలన 25 సంవత్సరాలు గడిచిన శుభ సందర్భముగా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సేవా సంకల్ప అభియాన్ లో భాగంగా అంగన్వాడీ ఉత్సవం ముడుమాల గ్రామంలో అంగన్వాడి సూపర్వైజర్ ప్రత్యూష ఆధ్వర్యంలో గురువారంఅంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది.
అంగన్వాడి టీచర్లను ఘనంగా సత్కరించారు. చిన్నారులకు అన్నప్రసన కార్యక్రమం తో పాటు సంకల్ప అభియాన్ లో భాగంగా గ్రామంలో ర్యాలీ నిర్వహించి అంగన్వాడికి సంబంధించి ప్రజలకు క్లుప్తంగా వివరించడం జరిగినది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగనవాడి ఉత్సవం ద్వారా చిన్నారులు తల్లులు అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు ప్రతినిధులు ఒకే వేదిక పైకి వచ్చి బాలల సమగ్ర అభివృద్ధిపై అవగాహన పెంచుకోవడం ఎంతో ముఖ్యమైన కార్యక్రమం అన్నారు.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మిషన్ సంక్షేమ అంగన్వాడి పోషణ్ 2.0 లో పోషకాహారంతో పాటు చిన్నారుల ప్రాథమిక బాల్య విధులకు ప్రాధాన్యత ఇస్తుందన్నారు అంగన్వాడి కార్యకర్తలు గ్రామీణ ప్రాంతాలలో తల్లులు చిన్నారులకు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలు అంగన్వాడి కేంద్రాలు మరింత బలవంతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రతి అంగన్వాడి కేంద్రంలో పరిశుభ్రమైన వాతావరణం నాణ్యమైన పోషకాహారం మెరుగైన ప్రీస్కూల్ విద్య తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమాలు అందేలా సమాజం కూడా భాగస్వామ్యం కావాలన్నారు. అంగన్వాడి ఉత్సవం సందర్భంగా అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు చేస్తున్న సేవలను గుర్తించి వారిని ప్రోత్సహించడానికి మనందరి బాధ్యత.
బాలల ఆరోగ్యం పోసిన విద్యపై పెట్టే ప్రతి అడుగు వికసిత భారతదేశ నిర్మాణానికి పెట్టుబడి అన్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు చంద్రకాంతం ఈశ్వరయ్య, కటారు వెంకటరమణ, తెలుగుదేశం పార్టీ నాయకులు రమణయ్య యాదవ్ మాజీ సర్పంచ్ మునిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.




