Rayachoti: గోల్డెన్ అవర్లో స్పందించి బాధితురాలు గోపికకు ప్రాణం పోసిన జీజీహెచ్ వైద్యులు
Rayachoti: రాప్తాడు ఘటనలో తీవ్రంగా గాయపడిన గోపికకు గోల్డెన్ అవర్లో అత్యవసర వైద్యంందించి ప్రాణాపాయం తప్పించిన అనంతపురం జీజీహెచ్ వైద్యుడు డాక్టర్ మయాన నూరుల్లా ఖాన్.
Rayachoti: గోల్డెన్ అవర్లో స్పందించి బాధితురాలు గోపికకు ప్రాణం పోసిన జీజీహెచ్ వైద్యులు
రాయచోటి: గోపిక ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రికి చేరుకోగా, అత్యవసర విభాగం (EMD) వైద్యులు గోల్డెన్ అవర్లో అందించిన తక్షణ వైద్య సేవలు ఆమె ప్రాణాలను కాపాడడంలో కీలకపాత్ర పోషించాయి. రక్తపోటు పూర్తిగా పడిపోయిన పరిస్థితిలో రాయచోటి పట్టణానికి చెందిన అనంతపురం జిజిహెచ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మాయన నూరుల్లా ఖాన్, సీఏంఓ డాక్టర్ శ్యామ్ వెంటనే స్పందించి అత్యవసర చికిత్స ప్రారంభించారు.
ముందుగా సెంట్రల్ లైన్ ఏర్పాటు చేసి రక్తం ఎక్కించారు.కుడివైపు ఛాతీలో ఐసీడీ ట్యూబ్ అమర్చడంతో పాటు ఈ-ఫాస్ట్ అల్ట్రాసౌండ్ స్కాన్ నిర్వహించారు. ముఖంపై ఉన్న గాయాలకు కుట్లు వేశారు. పరిస్థితికి అనుగుణంగా యాంటీబయాటిక్స్, నొప్పి నివారణ మందులు, ఇతర అత్యవసర ఔషధాలను అందించి రోగి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు కృషి చేశారు.
ఈ చికిత్సలో వైద్యులతో పాటు ఎంఎనీ నందు కూడా సమన్వయంతో పనిచేస్తూ అవసరమైన సహాయాన్ని అందించారు. అత్యవసర విభాగంలోని స్టాఫ్ నర్సులు, టెక్నీషియన్లు సైతం వైద్యులకు సహకరిస్తూ చికిత్స ప్రక్రియలో కీలకంగా.




