Proddatur: ప్రొద్దుటూరు అమ్మవారి శాల ఆలయంలో రాజరాజేశ్వరి దేవిగా అమ్మవారు!
Proddatur: ప్రొద్దుటూరు శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో రాజరాజేశ్వరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు. పోటెత్తిన భక్తులు, పటిష్ట పోలీసు బందోబస్తు.
Proddatur: ప్రొద్దుటూరు అమ్మవారి శాల ఆలయంలో రాజరాజేశ్వరి దేవిగా అమ్మవారు!
Proddatur: దసరా ఉత్సవాల్లో దేశంలోనే రెండవ మైసూర్ గా పేరుగాంచిన కడప జిల్లా ప్రొద్దుటూరులో దసరా శరన్నవరాత్రులు అంగరంగ వైభవంగా ప్రారంభం అయ్యాయి. దసరా శరన్నవరాత్రులలో భాగంగా శ్రీ కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో నేడు శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇచ్చారు. అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు ఆలయానికి పోటెత్తారు. భక్తులకు ఎటువంటి ఆసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు. పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.




