Proddatur: ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో కూటమి క్లీన్ స్వీప్
Proddatur: ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో 52 వార్డులూ ఏకగ్రీవమై కూటమి క్లీన్ స్వీప్ చేసింది. చైర్మన్‌గా నంద్యాల రాఘవరెడ్డి, 35వ వార్డు కౌన్సిలర్‌గా ఉట్టి సాయి నిఖిత ఎన్నికయ్యారు.
Proddatur: ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో కూటమి క్లీన్ స్వీప్
ప్రొద్దుటూరు: వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపల్ స్థానిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ (కూటమి) సంచలన విజయం సాధించింది. ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలోని మొత్తం 52 మున్సిపల్ వార్డులలో కౌన్సిలర్లు ఏకగ్రీవంగా ఎన్నికై, కూటమి క్లీన్ స్వీప్ నమోదు చేసింది. ఇందులో భాగంగా 35 వ వార్డు కౌన్సిలర్‌గా ఉట్టి సాయి నిఖిత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారుల నుంచి ఆమె తన ఎన్నికల డిక్లరేషన్ పత్రాన్ని అందుకున్నారు.
ప్రొద్దుటూరు మున్సిపల్ ఛైర్మన్‌గా నంద్యాల రాఘవరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మునిసిపల్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి చేతుల మీదుగా ఆయన అధికారిక డిక్లరేషన్ స్వీకరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై అభినందనలు తెలిపారు.




