Rayachoti: ఈ నెల 13, 14న అగ్రిగోల్డ్ బాండ్ల స్వీకరణ.. ఎస్సై సుస్మిత!
Rayachoti: రాయచోటి వీరబల్లి మండల అగ్రిగోల్డ్ బాధితులు ఈ నెల 13, 14 తేదీల్లో కడప ఎస్పీ కార్యాలయంలో అసలు బాండ్లు, పత్రాలు సమర్పించాలని ఎస్సై సుస్మిత సూచించారు.
Rayachoti: ఈ నెల 13, 14న అగ్రిగోల్డ్ బాండ్ల స్వీకరణ.. ఎస్సై సుస్మిత!
Rayachoti: కడప జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు అగ్రిగోల్డ్ బాధితుల బాండ్ల స్వీకరణ ప్రక్రియలో భాగంగా ఈ నెల 13..14వ తేదీన మంగళవారం బుధవారం మండలానికి చెందిన బాధితుల నుంచి బాండ్లు స్వీకరించనున్నట్లు వీరబల్లిఎస్సై సుస్మిత తెలిపారు.. బాధితులు కడప జిల్లా ఎస్పీ కార్యాలయం ఎదుట ఉన్న ఆర్.ఎస్.ఐ. కార్యాలయానికి తమ అసలు అగ్రిగోల్డ్ బాండ్లు, అవసరమైన ధ్రువపత్రాలతో హాజరై బాండ్లను నమోదు చేయించుకోవాలని మేడం.సూచించారు.
ఎస్సై సుస్మిత మాట్లాడుతూ బాండ్ల పరిశీలన సమయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బాధితులు ముందుగానే అవసరమైన పత్రాలను సిద్ధం చేసుకోవాలని కోరారు.
అసలు అగ్రిగోల్డ్ బాండుతో పాటు దాని స్వీయ ధ్రువీకరణ చేసిన పత్రాలను లేదా జిరాక్స్ పత్రాలను సమర్పించాలని తెలిపారు. పరిశీలన అనంతరం అసలు బాండును తిరిగి అందజేస్తారని వివరించారు. అలాగే బ్యాంకు ఖాతా పుస్తకంలోని మొదటి పేజీ నకలు, బాండుదారుని ఆధార్ కార్డు, ఓటరు గుర్తింపు కార్డు లేదా రేషన్ కార్డులో ఏదైనా ఒక గుర్తింపు పత్రం, పాన్ కార్డు నకలు, ఒక పాస్‌పోర్టు పరిమాణపు ఫొటో తప్పనిసరిగా తీసుకురావాలని సూచించారు.
బాండుదారుని బదులుగా నామినీ లేదా బంధువులు బాండును సమర్పించే సందర్భాల్లో సంబంధిత గుర్తింపు పత్రాలతో పాటు అవసరమైన అధికార పత్రాలు, బంధుత్వ ధ్రువీకరణ పత్రాలను తీసుకురావాలని తెలిపారు. బాండుదారుడు మరణించినట్లయితే మరణ ధ్రువపత్రాన్ని సమర్పించాలని పేర్కొన్నారు.
బాండుదారుడు, నామినీ ఇద్దరూ మరణించిన సందర్భాల్లో వారసత్వానికి సంబంధించిన ధ్రువపత్రాలు, ఇతర వారసుల వివరాలు, అవసరమైన అనుమతి పత్రాలను కూడా సమర్పించాల్సి ఉంటుందన్నారు. బాండుపై ఉన్న సంఖ్య, బాండుదారుని పేరు, నామినీ పేరు, సొమ్ము, తేదీ తదితర వివరాలను సంబంధిత రికార్డులతో పరిశీలిస్తామని ఎస్సై తెలిపారు. బాండులో దిద్దుబాట్లు, మార్పులు లేదా అనుమానాస్పద అంశాలు ఉన్నా, గతంలో అదే బాండుపై దరఖాస్తు చేసినా సంబంధిత అధికారులకు తెలియజేయాలని సూచించారు.
వీరబల్లిమండలానికి చెందిన అగ్రిగోల్డ్ బాధితులు కేటాయించిన తేదీన మాత్రమే అవసరమైన అన్ని పత్రాలతో హాజరై ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎస్సై సుస్మితకోరారు. బాధితులకు ప్రక్రియ సజావుగా సాగేందుకు సహకరించాలని, పత్రాల విషయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని మేడం కోరారు.




