Kadapa: చేపలకు చికెన్ వేస్ట్.. నిర్వాహకులపై ఆప్కాఫ్ చైర్మన్ ఆగ్రహం

Kadapa: మైలవరం రిజర్వాయర్ వద్ద చేపలకు చికెన్ వేస్ట్ వేస్తున్న అక్రమ చెరువులను వెంటనే నేలమట్టం చేయాలని ఆప్కాఫ్ చైర్మన్ యాటగిరి రాంప్రసాద్ ఆదేశించారు.

D. CHINNI KRISHNA, JAMMALAMADUGU
Published on: 19 Sept 2026 7:32 PM IST
Kadapa
X

Kadapa: చేపలకు చికెన్ వేస్ట్.. నిర్వాహకులపై ఆప్కాఫ్ చైర్మన్ ఆగ్రహం

Kadapa: ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారంటూ...మైలవరం రిజర్వాయర్ సమీపంలోని చేపల చెరువుల నిర్వాహకులపై ఆప్కాఫ్ ఛైర్మన్ యాటగిరి రాంప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న రెండు చేపల చెరువులను వెంటనే నేలమట్టం చేయాలని మత్స్యశాఖ అధికారులను ఆదేశించారు.

కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోని మైలవరం రిజర్వాయర్ సమీపంలో చేపల చెరువులను ఆప్కాఫ్ ఛైర్మన్ యాటగిరి రాంప్రసాద్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మత్స్యశాఖ డీడీ నాగయ్య, ఎఫ్‌డీఓ బాలరాజు, సిబ్బందితో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సుమారు 10 ఎకరాల్లో ఒకటి, 15 ఎకరాల్లో మరో చేపల చెరువు ఉన్నట్లు గుర్తించారు. ఈ చెరువులకు ఇరిగేషన్, మత్స్యశాఖ అనుమతులు లేవని, అయినప్పటికీ కొంతకాలంగా నిర్వహిస్తున్నారని అధికారులు తెలిపారు. అదే సమయంలో చేపలకు చికెన్ వేస్ట్‌ను ఆహారంగా వినియోగిస్తున్నట్లు గుర్తించడంతో నిర్వాహకులను ప్రశ్నించారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఇలాంటి విధానాలకు స్వస్తి పలకాలని సూచించారు.

అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ఈ రెండు చెరువులను వెంటనే నేలమట్టం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ వ్యవహారాన్ని కలెక్టర్, మత్స్యశాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.చేశారు.ఈ తనిఖీల్లో మత్స్యకార సంఘాల నాయకులు మల్లె వెంకట సుబ్బయ్య, బోలా సుబ్బారాయుడు, సాయి తదితరులు పాల్గొన్నారు.

D. CHINNI KRISHNA, JAMMALAMADUGU

D. CHINNI KRISHNA, JAMMALAMADUGU