Rayachoty: రాయచోటిలో నూతన కోర్టు భవనాలు నిర్మించాలని హైకోర్టు!

Rayachoty: రాయచోటిలో కోర్టు భవనాల నిర్మాణాన్ని త్వరితగతిన చేపట్టాలని కోరుతూ న్యాయవాదులు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాజశేఖర్ రావుకు వినతిపత్రం అందజేశారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 27 Sept 2026 8:26 AM IST
Rayachoty
X

Rayachoty: రాయచోటిలో నూతన కోర్టు భవనాలు నిర్మించాలని హైకోర్టు!

Rayachoty: హైకోర్టు న్యాయమూర్తి కడప జిల్లా పోర్ట్ పోలియో జడ్జ్ జస్టిస్ రాజశేఖర్ రావును కడపలో రాయచోటి బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పి రెడ్డి భాష, బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు ఎన్ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలోన్యాయవాదులు కలిసి రాయచోటి కోర్టు భవనాలను త్వరిత గతిన నిర్మించడానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.

గత మూడు సంవత్సరాలుగా అద్దె భవనాలలో రాయచోటి లోని పిడిఎం,సబ్ కోర్టు, జిల్లా కోర్టు నిర్వహిస్తున్నారని అద్దె భవనాలలో మౌలిక వసతులు లేక కక్షిదారులు, న్యాయవాదులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని హైకోర్టు న్యాయమూర్తికి ఇచ్చిన వినతి పత్రంలో వివరించినట్లు తెలిపారు.రాయచోటి కోర్టు ప్రాంగణాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆర్ రాజగోపాల్ పరిశీలించిన తర్వాత తగిన నిర్ణయం తీసుకుంటామని హైకోర్టు న్యాయమూర్తి తెలిపినట్లు న్యాయవాదులు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో రాయచోటి బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు ఎస్ లక్ష్మీదేవి, ట్రెజరర్ ఖుష్ణుమా, స్పోర్ట్స్ సెక్రటరీ టీవీ రమణ భారత న్యాయవాదుల సంఘం కడప ఉమ్మడి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ టి.ఈశ్వర్, రాష్ట్ర కమిటీ సభ్యులు ఆర్.ఆనందకుమార్, న్యాయవాదులు హ్యూమయున్, భాష, వరలక్ష్మి పాల్గొన్నారు

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI