Duvvuru: చల్లబసాయపల్లెలో అభయఆంజనేయస్వామి 7వ వార్షికోత్సవం
Duvvuru: వైఎస్సార్ కడప జిల్లా దువ్వూరు మండలం చల్లబసాయపల్లెలో శ్రీ అభయఆంజనేయస్వామి 7వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని విశేష అభిషేకాలు, ఆకుపూజలు నిర్వహించారు.
Duvvuru: చల్లబసాయపల్లెలో అభయఆంజనేయస్వామి 7వ వార్షికోత్సవం
దువ్వూరు: మండల పరిధిలోని చల్ల బసాయపల్లె గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ అభయ ఆంజనేయస్వామి ఏడవ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. అర్చకులు లక్ష్మీ నరసింహమూర్తి శర్మ వేదమంత్రాలతో పసుపు కుంకుమాభిషేకం, నెయ్యభిషేకం, గంధం అభిషేకం, పాలాభిషేకం, పంచామృతభిషేకం, పన్నీరు అభిషేకం, అర్చన లు ఘనంగా చేశారు.
ఉదయం నుంచి మహిళలు యువకులు స్వామివారిని 108 బిందెల నీటితో అభిషేకం చేశారు. సాయంత్రం ఆంజనేయస్వామికి తమలపాకులతో ఆకు పూజలు చేశారు. రాత్రికి హరి భజన నిర్వహించారు. వచ్చిన భక్తులందరికీ తీర్థప్రసాదాలు అందించినట్లు స్వామి వారి కమిటీ సభ్యులు తెలిపారు.




