Proddatur: టీడీపీకి బిగ్ షాక్.. వైఎస్సార్‌సీపీలో చేరిన 40 కుటుంబాలు!

Proddatur: వైఎస్‌ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో టీడీపీకి షాక్. రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సమక్షంలో వైఎస్‌ఆర్‌సీపీలో చేరిన 40 కుటుంబాలు.

P. GURUSWAMI, PRODDUTUR
Published on: 11 Oct 2026 3:52 PM IST
Proddatur
X

Proddatur: టీడీపీకి బిగ్ షాక్.. వైఎస్సార్‌సీపీలో చేరిన 40 కుటుంబాలు!

Proddatur: స్థానిక రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని 13వ సచివాలయం పరిధిలో టీడీపీకి చెందిన సుమారు 40 కుటుంబాలు వైఎస్సార్‌సీపీలో చేరాయి. ​రాయల్ ఫంక్షన్ హాల్ ఎదురుగా జరిగిన ఈ కార్యక్రమంలో దివంగత మాజీ కౌన్సిలర్ వై.ఎస్. హమీద్ కుటుంబ సభ్యులతో పాటు పలువురు టీడీపీని వీడి వైఎస్సార్‌సీపీ తీర్థం పుచ్చుకున్నారు.

పార్టీలోకి వచ్చిన వారికి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు, నాయకులు పాల్గొన్నారు. ఒకేసారి ఇన్ని కుటుంబాలు పార్టీ మారడం స్థానికంగా చర్చనీయాంశమైంది.

P. GURUSWAMI, PRODDUTUR

P. GURUSWAMI, PRODDUTUR