Malkajgiri: మల్కాజిగిరిలో వీధి దీపాల సమస్యను పరిష్కరించిన కాంగ్రెస్ నేత!
Malkajgiri: మల్కాజిగిరి బాల సరస్వతి నగర్, నరసింహారెడ్డి నగర్ కాలనీల్లో వీధి దీపాల సమస్యను పరిష్కరించిన కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షుడు జీడీ సంపత్ గౌడ్.
Malkajgiri: మల్కాజిగిరిలో వీధి దీపాల సమస్యను పరిష్కరించిన కాంగ్రెస్ నేత!
Malkajgiri: మల్కాజిగిరి డివిజన్ పరిధిలోని బాల సరస్వతి నగర్, నరసింహారెడ్డి నగర్ కాలనీల్లో వీధి దీపాలు వెలగడం లేదని స్థానికులు కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు జీడీ సంపత్ గౌడ్ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో స్పందించిన ఆయన సంబంధిత వీధి దీపాల విభాగం డీఈ, ఏఈలతో మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. వీధి దీపాలు ఏర్పాటు చేయించడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా జీడీ సంపత్ గౌడ్ మాట్లాడుతూ.. డివిజన్ పరిధిలోని కాలనీలు, బస్తీలలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికి ముందుండి కృషి చేస్తున్నామని తెలిపారు. మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సహకారంతో డివిజన్‌తో పాటు నియోజకవర్గ పరిధిలో ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో స్థానికులు మనోహర్, యాదగిరి గౌడ్,మహేష్, రామచందర్,పార్థసారథి తదితరులు పాల్గొన్నారు.




