ట్రంప్‌కు షాక్.. హెచ్‌-1బీ వీసాదారులకు ఊరట.?

అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాల్లో డెమొక్రాట్లు ఘన విజయం సాధించి, ప్రతినిధుల సభ (హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్)తో పాటు సెనేట్‌పై పూర్తి నియంత్రణ సాధించడం

G Krishna
Published on: 5 Nov 2026 3:36 PM IST
ట్రంప్‌కు షాక్.. హెచ్‌-1బీ వీసాదారులకు ఊరట.?
X

అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాల్లో డెమొక్రాట్లు ఘన విజయం సాధించి, ప్రతినిధుల సభ (హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్)తో పాటు సెనేట్‌పై పూర్తి నియంత్రణ సాధించడం భారతీయ ఐటీ నిపుణులకు పెద్ద ఊరటగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హయాంలో తీవ్రరూపం దాల్చిన కఠిన వలస విధానాలు, హెచ్-1బీ వీసాలపై మోపిన ఊహించని ఫీజుల భారం , గ్రీన్ కార్డ్ బ్యాక్‌లాగ్ కష్టాలకు ఈ సంచలన ఫలితాలు చెక్ పెట్టవచ్చని నిపుణులు భావిస్తున్నారు.

గత కొంతకాలంగా హెచ్-1బీ వీసా వ్యవస్థను స్వదేశీ నిరుద్యోగానికి కారణమని విమర్శిస్తూ ట్రంప్ ప్రభుత్వం భారీగా ఫీజులు పెంచడం, కొత్త ఆంక్షలు విధించడం వంటి నిర్ణయాలతో భారతీయ టెక్కీలను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. అయితే, ఇప్పుడు కాంగ్రెస్‌లో డెమొక్రాట్ల పూర్తి ఆధిపత్యం నెలకొనడంతో, ట్రంప్ ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకొచ్చే కఠిన వలస నిర్ణయాలకు అడ్డుకట్ట పడనుంది. ముఖ్యంగా గ్రీన్ కార్డ్ మంజూరులో దశాబ్దాలుగా వేధిస్తున్న 7 శాతం దేశాలవారీ కోటా పరిమితిని తొలగించడం లేదా వార్షిక కేటాయింపులను పెంచడం వంటి అంశాలపై కాంగ్రెస్ శాసనసభా సవరణలు తెచ్చే వీలుంది. జనవరి 2027లో కొత్తగా ఏర్పాటయ్యే కాంగ్రెస్ కమిటీల పర్యవేక్షణలో హెచ్-1బీ నిబంధనలు సడలించడంతో పాటు, ఏళ్లుగా తాత్కాలిక వీసాలపై గడుపుతున్న వేలాది మంది భారతీయ కుటుంబాలకు శాశ్వత నివాస (గ్రీన్ కార్డ్) హక్కులు లభించే దిశగా కొత్త సంస్కరణలు ఊపందుకుంటాయని ఆశలు చిగురిస్తున్నాయి.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.