సౌదీ దాడిలో మరో భారతీయుడు మృతి.. ఇద్దరికి చేరిన సంఖ్య

సౌదీ అరేబియాలోని రియాద్‌లో ఉన్న కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్టోబర్ 10న జరిగిన దాడిలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న మరో భారతీయ

G Krishna
Published on: 5 Nov 2026 1:11 PM IST
Saudi Riyadh Airport Attack
X

Saudi Riyadh Airport Attack

సౌదీ అరేబియాలోని రియాద్‌లో ఉన్న కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్టోబర్ 10న జరిగిన దాడిలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న మరో భారతీయ పౌరుడు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ ఘోర ఘటనలో మృతి చెందిన భారతీయుల సంఖ్య ఇద్దరికి చేరగా, మొత్తం మృతుల సంఖ్య 14కి పెరిగింది. రియాద్‌లోని భారత రాయబార కార్యాలయం (ఎంబసీ) సోషల్ మీడియా వేదికగా ఈ విషాద వార్తను ధృవీకరించింది.

ఐసీయూలో చికిత్స పొందుతూ మృతి

ఘటన జరిగిన రోజు నుంచి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU)లో చికిత్స పొందుతున్న సదరు భారతీయుడు మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచారని ఎంబసీ అధికారులు తెలిపారు. ఈ దుర్ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన భారత రాయబార కార్యాలయం, మృతుని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపింది. ప్రారంభంలో ఈ దాడిలో 12 మంది ప్రాణాలు కోల్పోగా, 309 మంది గాయపడినట్లు సౌదీ సివిల్ ఏవియేషన్ జనరల్ అథారిటీ (GACA) వెల్లడించిన విషయం తెలిసిందే.

కుటుంబానికి అండగా భారత ఎంబసీ

బాధిత కుటుంబానికి మొదటి నుంచి అండగా నిలుస్తున్నట్లు ఎంబసీ అధికారులు స్పష్టం చేశారు. కుటుంబ సభ్యుల కోరిక మేరకు మృతదేహాన్ని భారత్‌కు రప్పించేందుకు ఏర్పాట్లు చేగయడం లేదా వారి ఇష్టానుసారం రియాద్‌లోనే అంత్యక్రియలు నిర్వహించేలా అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తామని భరోసానిచ్చారు. అంతకుముందు ఇదే దాడిలో ప్రాణాలు కోల్పోయిన మరో భారతీయ పౌరుడు మహమ్మద్ యూసుఫ్ అలీ భౌతిక కాయానికి కుటుంబ సభ్యుల అభ్యర్థన మేరకు అక్టోబర్ 12న రియాద్‌లోనే అంత్యక్రియలు నిర్వహించారు. ఆ అంతిమ సంస్కారాలలో రాయబార కార్యాలయ అధికారులు స్వయంగా పాల్గొని నివాళులర్పించారు. విదేశీ గడ్డపై జరిగిన ఈ దుర్ఘటన బాధిత కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.