ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారి.. భారత్‌కు రానున్న పాక్ మంత్రి
Pakistan minister India visit: ఈ నెలాఖరులో భారత్‌లో జరగనున్న ఒక ప్రాంతీయ సమావేశానికి పాకిస్థాన్ తన వాతావరణ శాఖ మంత్రిని పంపనున్నట్లు ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ.
ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారి.. భారత్‌కు రానున్న పాక్ మంత్రి
Pakistan minister India visit: ఈ నెలాఖరులో భారత్‌లో జరగనున్న ఒక ప్రాంతీయ సమావేశానికి పాకిస్థాన్ తన వాతావరణ శాఖ మంత్రిని పంపనున్నట్లు ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి శనివారం (నవంబర్ 14) అధికారికంగా ప్రకటించారు. 'ఆపరేషన్ సిందూర్' అనంతరం పాకిస్థాన్‌కు చెందిన ఒక మంత్రి భారత పర్యటనకు రావడం ఇదే మొదటిసారి కావడంతో ఈ పరిణామం దౌత్య వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.
ఎస్‌సీఓ సదస్సులో పాల్గొననున్న ముసాదిక్ మసూద్ మాలిక్
పాకిస్థాన్ విదేశాంగ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, ఆ దేశ వాతావరణ మార్పుల శాఖ మంత్రి ముసాదిక్ మసూద్ మాలిక్ న్యూఢిల్లీలో జరగనున్న షాంఘై సహకార సంస్థ (SCO) సివిలైజేషనల్ డైలాగ్ సమావేశంలో పాల్గొంటారు. ఈ నెలాఖరులో జరగనున్న ఈ ప్రాంతీయ సదస్సులో పాకిస్థాన్ తరఫున ఆయన ప్రాతినిధ్యం వహించనున్నారు.
దౌత్య వర్గాల్లో ఆసక్తి
ఆపరేషన్ సిందూర్ పరిణామాల తర్వాత ఇరు దేశాల మధ్య నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో, పాకిస్థాన్ మంత్రి భారత పర్యటనకు రావడం ఇదే ప్రథమం. బహుపాక్షిక వేదికైన ఎస్‌సీఓ సమావేశం కోసమే ఈ పర్యటన జరుగుతున్నప్పటికీ, దౌత్యపరంగా ఇది ఆసక్తికరమైన అంశంగా మారింది. ఈ పర్యటనకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది.




